ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. మార్చి17(శుక్రవారం)న ముంబై వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఐపీఎల్-2023 ప్రారంభానికి ముందు భారత జట్టుకు ఇదే చివరి సిరీస్.
ఇక ఈ వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో విరాట్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుతమైన సెంచరీతో చెలరేగిన కోహ్లి(186).. ఆఖరి టెస్టును డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు.
కోహ్లి ముందున్న రికార్డులు ఇవే..
►ఈ సిరీస్‌లో కోహ్లి మరో 191 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 13,000 పరుగులు పూర్తి చేసిన 5వ బ్యాటర్‌గా రికార్డులకెక్కుతాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో వరుసగా సచిన్ టెండూల్కర్ (18426), కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్ (13,704), సనత్ జయసూర్య (13,430) ఉన్నారు.
►అదే విధంగా ఈ సిరీస్‌లో కోహ్లి మరో మూడు సెంచరీలు సాధిస్తే.. సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల(49) ప్రపంచరికార్డును సమం చేస్తాడు. కోహ్లి ఇప్పటివరకు వన్డేల్లో 46 సెంచరీలు సాధించాడు.
►ఇక తొలి వన్డేలో విరాట్ 48 పరుగులు సాధిస్తే.. స్వదేశంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్(5406)ను కోహ్లి అధిగమిస్తాడు. కోహ్లి ఇప్పటివరకు సొంత గడ్డపై వన్డేల్లో 5358 పరుగులు చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(6976) పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.
చదవండి: IPL 2023: కొత్త సీజన్.. కొత్త కెప్టెన్.. సన్‌రైజర్స్ కొత్త జెర్సీ అదిరిపోయిందిగా!
Comments
Please login to add a commentAdd a comment