టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. 47 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్.. 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను రోహిత్ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు.
రోహిత్ సాధించిన రికార్డులు ఇవే..
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ రికార్డును రోహిత్ సమం చేశాడు. మోర్గాన్ కెప్టెన్‌గా 180 ఇన్నింగ్స్‌లలో 233 సిక్స్‌లు బాదగా.. రోహిత్ కేవలం 134 ఇన్నింగ్స్‌లలోనే 233 సిక్స్‌లు కొట్టేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 15000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో భారత ఓపెనర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు ఓపెనర్‌గా 352 ఇన్నింగ్స్‌లలో15,035 పరుగులు చేశాడు.
ఈ జాబితాలో భారత లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(16,119) తొలి స్ధానంలో ఉండగా.. రెండో స్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15,335) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment