
కొలంబో: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ భారత అండర్–19 జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. శ్రీలంక అండర్–19 జట్టుతో మంగళవారం ఇక్కడ ప్రారంభమైన నాలుగు రోజుల యూత్ టెస్టులో ఎడంచేతి పేసర్ అర్జున్ అరంగేట్రం చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో శ్రీలంక ఓపెనర్ మిషారా (9)ను ఎల్బీగా ఔట్ చేసిన అతను జట్టుకు శుభారంభం ఇచ్చాడు. మొత్తం 11 ఓవర్లు వేసిన అర్జున్ 33 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఆయుష్ బదోని (4/24), హర్‡్ష త్యాగి (4/92) ధాటికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment