Shubman Gill Breaks Sachin Tendulkar To Create a Unique Record vs West Indies - Sakshi
Sakshi News home page

IND Vs WI 1st ODI: శుభ్‌మన్‌ గిల్‌ అరుదైన ఫీట్‌.. సచిన్‌ రికార్డు బద్దలు..!

Published Sat, Jul 23 2022 9:01 AM | Last Updated on Sat, Jul 23 2022 2:53 PM

Shubman Gill Breaks Sachin Tendulkar to create unique record vs West Indies - Sakshi

Ind Vs WI 1st ODI: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేతో రీ ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ గిల్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. గిల్‌ 53 బంతుల్లో 6 ఫోర్లు,2 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన గిల్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్‌ గడ్డపై వన్డే ఫార్మాట్‌లో అర్ధ సెంచరీ సాధించిన రెండో భారత అతి పిన్న వయస్కుడుగా గిల్‌ రికార్డులకెక్కాడు.

అంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో సచిన్‌ రికార్డును గిల్‌ బ్రేక్‌ చేశాడు. సచిన్‌ ఈ ఫీట్‌ను 24 ఏళ్ల 3 రోజుల వయస్సులో నమోదు చేయగా.. గిల్‌ 22 ఏళ్ల 317 రోజుల వయస్సులో సాధించాడు.

ఇక ఈ ఘనతను భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి  కేవలం 22 ఏళ్ల 215 రోజుల వయస్సులో సాధించి తొలి స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన తొలిపోరులో విండీస్‌పై భారత్‌ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇండియా వర్సెస్‌ వెస్టిండీస్‌ తొలి వన్డే
వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
టాస్‌: విండీస్‌- బౌలింగ్‌
భారత్‌ స్కోరు: 308/7 (50 ఓవర్లు)
వెస్టిండీస్‌ స్కోరు: 305/6 (50 ఓవర్లు)
విజేత: భారత్‌.. 3 పరుగుల తేడాతో గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: శిఖర్‌ ధావన్‌ ‌(97 పరుగులు)
అర్ధ సెంచరీలతో రాణించిన గిల్‌(64), శ్రేయస్‌ అయ్యర్‌(54)
చదవండి: IND Vs WI 1st ODI: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement