
ఐపీఎల్-2023లో తమ తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైన ముంబై ఇండియన్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. వాంఖడే వేదికగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో పలు మార్పులతో ముంబై బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
సీఎస్‌కేతో మ్యాచ్‌కు ముందు ముంబై పేసర్ జోఫ్రా అర్చర్ నెట్స్‌లో గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ మ్యాచ్‌కు అర్చర్ దూరమైతే అతడి స్థానంలో మెరిడిత్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా యువ స్పిన్నర్ హృతిక్ షోకిన్ స్థానంలో కుమార్ కార్తీకేయకు ఛాన్స్ ఇవ్వాలని ముంబై మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వినికిడి.
అర్జున్ టెండ్కూలర్ ఎంట్రీ..
మరోవైపు సచిన్ తనయుడు అర్జున్ టెండ్కూలర్ సీఎస్‌కే మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. 2021లో ముంబయి ఇండియన్స్ జట్టులోచేరిన అర్జున్.. ఇప్పటివరకు ఒక మ్యాచ్‌లో కూడా ఆడలేదు. కాగా సీఎస్‌కేతో మ్యాచ్‌కు ముందు అర్జున్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేసింది.
దీంతో అర్జున్ ఐపీఎల్ ఎంట్రీ ఖాయమని ముంబై అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కాగా దేశావాళీ క్రికెట్‌లో గోవా తరపున అర్జున్ ఆడుతున్న సంగతి తెలిసిందే. రంజీ సీజన్ 2022-23లో అర్జున్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తన మ్యాచ్‌లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 7 లిస్ట్-ఏ(25 వికెట్లు) మ్యాచ్‌లు ఆడిన అతడు.. ఐదు ఫస్ట్ క్లాస్(9 వికెట్లు) మ్యాచులు, 9 టీ20లు(12 వికెట్లు) ఆడాడు.
చదవండి: IPL 2023 SRH vs LSG: ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు
Arjun ko bas 🎯 dikhta hai 🤌🔥#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan #TATAIPL #IPL2023 pic.twitter.com/IYHgDpBPEs
— Mumbai Indians (@mipaltan) April 7, 2023