
ముంబై: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేల ఇన్‌స్టాగ్రామ్ లో తన అభిమాని అడిగిన ప్రశ్నకు వింతగా సమాధానమిచ్చింది. ‘మిస్ ఇండియా’ గా ప్రజలకు పరిచయమైన ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాల్లో నటించిన తర్వాత బాగానే పాపులర్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఊర్వశీ ఇన్‌స్టాలో 35.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఊర్వశీ ఇన్‌స్టాలో తన అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తుంటారు. ఈ నేపథ్యంలో ‘మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు?’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇవ్వడం గమనార్హం. ‘నేను క్రికెట్ అస్సలు చూడను, కాబట్టి నాకు ఏ క్రికెటర్ తెలియదు. కానీ సచిన్ సార్, విరాట్ సార్ అంటే మాత్రం అమితమైన గౌరవం’ అని జవాబిచ్చింది. ఏడాది క్రితం టీమ్‌ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్‌తో కలిసి ఊర్వశీ రౌతేలా భోజనం చేస్తున్న చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. బహుశా ఆమె పంత్ ప్రియురాలేమోనని అప్పట్లో గుసగుసలు కూడా వినపడ్డాయి.
( చదవండి: పెళ్లి తర్వాత నటించన్నావ్.. మరి ఇదేంటి?! )
Comments
Please login to add a commentAdd a comment