టీ20 ప్రపంచకప్-2022లో దాయాదుల పోరు అభిమానులకు అసలు సిసలైన మజా అందించింది. సూపర్-12లో భాగంగా అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 83 పరుగులతో అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లి ఒంటి చేత్తో భారత్‌ను గెలిపించాడు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
కోహ్లి సాధించిన రికార్డులు ఇవే
►ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తద్వారా అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు సాధించిన క్రికెటర్‌గా కోహ్లి (14 సార్లు) గుర్తింపు పొందాడు. మొహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్–13 సార్లు)ని కోహ్లి రెండో స్థానానికి పంపించాడు.
టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు అందుకున్న క్రికెటర్‌గా కోహ్లి (6 సార్లు) నిలిచాడు. గేల్ (వెస్టిండీస్; 5 సార్లు) రికార్డును కోహ్లి అధిగమించాడు.
► టి20 మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన క్రికెటర్‌గా షోయబ్ మాలిక్ (పాకిస్తాన్; 18 సార్లు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి (18 సార్లు) సమం చేశాడు.
►పాక్‌పై ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లి (110 మ్యాచ్‌ల్లో 3,794) మళ్లీ టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. రోహిత్ శర్మ (143 మ్యాచ్‌ల్లో 3,741 పరుగులు) రెండో స్థానానికి పడిపోయాడు.
►అదే విధంగా ఐసీసీ టోర్నమెంట్స్‌లో అత్యధిక ఫిప్టీ ప్లస్ పరుగులు సాధించిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలిచాడు. ఐసీసీ మెగా ఈవెంట్‌లో కోహ్లికి ఇది 24 వ ఫిప్టీ ప్లస్ స్కోర్ . అంతకుముందు ఈ రికార్డు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్(23) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో సచిన్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు.
చదవండి: T20 WC PAK Vs IND: మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు..! కానీ క్రెడిట్ విరాట్‌కే ఇవ్వాలి
Comments
Please login to add a commentAdd a comment