టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. భారత స్టార్ విరాట్ కోహ్లి తన విరోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకు మరుపుని విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో 82 పరుగులు చేసిన కోహ్లి.. అఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఇక భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించిన కింగ్ కోహ్లి.. మైదానంలోనే భాగోద్వేగానికి లోనయ్యాడు. గెలుపు సంబరాలను జరపుకుంటూనే విరాట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఇక పాక్ బ్యాటర్లలో షాన్ మసూద్(52), ఇఫ్తికర్ అహ్మద్(51) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో ఆర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా మూడు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన చేశారు. వీరితో పాటు భువనేశ్వర్, షమీ చెరో వికెట్ సాధించి పర్వాలేదనిపించారు.
31 పరుగులకే 4 వికెట్లు
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో విరాట్, హార్దిక్ భారత జట్టును అదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా.. నవాజ్ వేసిన తొలి బంతికే హార్దిక్ పెవిలియన్‌కు చేరాడు.
అనంతరం విరాట్ మూడో బంతికి సిక్స్ కొట్టి జట్టును విజయానికి చేరువ చేశాడు. ఇక ఆఖరి బంతికి అశ్విన్ సింగిల్ తీసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. కాగా నవాజ్ వేసిన అఖరి ఓవర్‌లో ఎక్స్‌ట్రాస్ రూపంలో భారత్‌కు 5 పరుగులు వచ్చాయి. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
Diwali just came early #ViratKohli is back! pic.twitter.com/rH0mYKu0Lt
— Sonal MehrotraKapoor (@Sonal_MK) October 23, 2022
చదవండి: T20 WC PAK Vs IND: నరాలు తెగే ఉత్కంఠ.. ‘విరాట పర్వం’లో విజయం మనదే!
Comments
Please login to add a commentAdd a comment