గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. టీ20 ప్రపంచకప్-2022 భాగంగా మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఓటమి ఖాయం అనుకున్న వేళ కోహ్లి తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు హార్దిక్ పాండ్యా (37 బంతుల్లో 40) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో విరాట్, హార్దిక్ భారత జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా.. నవాజ్ వేసిన తొలి బంతికే హార్దిక్ పెవిలియన్‌కు చేరాడు.
అనంతరం కోహ్లి సిక్స్ బాది మ్యాచ్‌ను భారత్‌వైపు మలిచాడు. కాగా ఆఖరి ఓవర్‌లో ఎక్స్‌ట్రాస్ రూపంలో 5 పరుగులు వచ్చాయి. పాక్ బౌలర్లలో రౌఫ్, నవాజ్ రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఇక పాక్ బ్యాటర్లలో షాన్ మసూద్ (52), ఇఫ్తికర్ అహ్మద్ (51) పరుగులతో రాణించారు.
చదవండి: IND VS PAK: ‘ఖలీస్తానీ’ అన్న నోళ్లతో 'సింగ్ ఈజ్ కింగ్' అనిపించుకున్న అర్ష్‌దీప్
Comments
Please login to add a commentAdd a comment