టీ20 ప్రపంపచకప్-2022ను టీమిండియా విజయంతో ఆరంభించింది. సూపర్-12లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. అఖరి బంతికి వరకు ఉత్కంఠ భరితంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ మ్యాచ్‌లో 82 పరుగులు చేసిన విరాట్.. ఆఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అదే విధంగా భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లతో అదరగొట్టిన హార్దిక్.. తర్వాత బ్యాటింగ్‌లో కూడా 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఇక ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో ఓటమిపై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం స్పందించాడు. మ్యాచ్ అనంతరం బాబర్ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే క్రెడిట్ మాత్రం కోహ్లి, పాండ్యాకు ఇవ్వాలి. ఇక తొలుత బ్యాటింగ్‌లో మేము అంతగా రాణించలేకపోయాము. పవర్ ప్లేలో మాకు మంచి శుభారంభం లభించలేదు.
కానీ 10 ఓవర్ల తర్వాత షాన్ మసూద్, ఇఫ్తికర్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 160 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు ముందు ఉంచాం. అయితే మా బౌలర్లు కూడా పవర్ ప్లేలో వికెట్లు పడగొట్టి మాకు మంచి శుభారంభం ఇచ్చారు. అయితే మిడిల్ ఓవర్లలో మాకు వికెట్ కావాలని నిర్ణయించుకుని స్పిన్నర్‌ను వెనక్కి పట్టుకున్నాం. కానీ విరాట్ మాత్రం మా ప్లాన్స్‌ను దెబ్బకొట్టాడు. విరాట్ అద్భుతమైన ఆటగాడు. అయితే ఈ మ్యాచ్‌లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి" అని పేర్కొన్నాడు.
చదవండి: T20 WC PAK Vs IND: కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌కు రోహిత్ ఫిదా.. భుజంపై ఎత్తుకుని మరి!
Comments
Please login to add a commentAdd a comment