టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి..8 ఫోర్లు, 1 సిక్స్‌తో 64 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
ఇక అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 5 పరుగుల తేడాతో (డక్‌వర్త్–లూయిస్ ప్రకారం) భారత్ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అవి ఏంటో ఓ లుక్కేద్దాం.
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు వీరుడు
పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్ అవతరించాడు. బంగ్లాతో మ్యాచ్‌లో 16 పరుగుల వద్ద వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే (31 మ్యాచ్‌ల్లో 1,016 పరుగులు) పేరిట ఉన్న ఈ రికార్డు కోహ్లి ఖాతాలోకి చేరింది. కెరీర్‌లో ఐదో టి20 ప్రపంచకప్ ఆడుతున్న కోహ్లి ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడి 23 ఇన్నింగ్స్‌లలో మొత్తం 1,065 పరుగులు సాధించాడు.
అదే విధంగా అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలోనూ కోహ్లి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు కోహ్లి 113 టి20 మ్యాచ్‌లు ఆడి 3,932 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ (146 మ్యాచ్‌ల్లో 3,811 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు.
సచిన్ రికార్డు బద్దలు
ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. ఇప్పటి వరకు అస్ట్రేలియాలో అన్ని ఫార్మాట్‌లలో కలిపి విరాట్ 3350 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (ఆస్ట్రేలియాలో 3,300 పరుగులు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి అధిగమించాడు.
టి20 ప్రపంచకప్ టోర్నీలలో మూడు లేదా అంతకంటే ఎక్కువ అర్ధ సెంచరీలు చేయడం కోహ్లికిది మూడోసారి. తాజా ప్రపంచకప్‌తోపాటు 2014, 2016 ప్రపంచకప్ టోర్నీల్లోనూ కోహ్లి ఈ ఘనత సాధించాడు. గతంలో ఏ క్రికెటర్ కూడా ఇలా చేయలేదు.
అత్యధిక మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు
అదే విధంగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌లు అవార్డులు అందుకున్న క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు. బంగ్లాతో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గానూ విరాట్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. టీ20 ప్రపంచకప్‌లో విరాట్‌కి ఇది ఏడో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్.
చదవండి: T20 WC 2022: మళ్లీ మాది పాత కథే.. వర్షం రాక పోయుంటే విజయం మాదే: షకీబ్
Comments
Please login to add a commentAdd a comment