ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 154 బంతుల్లో తన 12వ టెస్టు సెంచరీ మార్కు అందుకున్నాడు. ఓవరాల్‌గా ఇది 48 అంతర్జాతీయ టెస్టు సెంచరీ కావడం విశేషం.
మొత్తంగా 162 బంతుల్లో 103 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. స్టోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాగా శుబ్‌మన్ గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 160 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ పలు అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు.
రోహిత్ సాధించిన రికార్డులు ఇవే..
►అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ క్రమంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(48) రికార్డును రోహిత్ సమం చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్(100) తొలి స్దానంలో ఉండగా.. కోహ్లి(80) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.
►అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఓపెనర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. రోహిత్‌కు ఇది ఓపెనర్‌గా 43వ సెంచరీ. ఈ క్రమంలో క్రిస్ గేల్(42) రోహిత్ అధిగమించాడు. ఈ లిస్ట్‌లో డేవిడ్ వార్నర్(49) అగ్రస్ధానంలో ఉన్నాడు.
►అదే విధంగా టెస్టుల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా ఓపెనర్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును రోహిత్ సమం చేశాడు. గవాస్కర్ ఓపెనర్‌గా ఇంగ్లండ్‌పై 4 సెంచరీలు చేయగా.. హిట్‌మ్యాన్ సైతం 4 సెంచరీలు చేశాడు.
►ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు డబ్ల్యూటీసీ చరిత్రలో 9 సెంచరీలు సాధించాడు.
►30 ఏళ్ల వయస్సు తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా సచిన్ టెండూల్కర్(35) రికార్డును సైతం రోహిత్ బ్రేక్ చేశాడు. 30 ఏళ్ల వయస్సు తర్వాత సచిన్ 35 సెంచరీలు చేయగా.. రోహిత్ సైతం 35 సెంచరీలు చేశాడు. మరోసెంచరీ చేస్తే సచిన్ రికార్డును రోహిత్ బ్రేక్ చేస్తాడు.
Of hundreds and celebrations! 👏 🙌
— BCCI (@BCCI) March 8, 2024
Rohit Sharma 🤝 Shubman Gill
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ImRo45 | @ShubmanGill | @IDFCFIRSTBank pic.twitter.com/yTZQ4dAoEe
Comments
Please login to add a commentAdd a comment