Shakib Al Hasan All Time Best ODI XI
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తన ఆల్-టైమ్ ఎలెవన్ వన్డే టీమ్‌ను ప్రకటించాడు. ఆ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు స్థానం కల్పించాడు. తన ఆల్-టైమ్ ఎలెవన్ వన్డే టీమ్‌కు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్ ఎంచుకున్నాడు. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌కు, పాక్ మాజీ ఆటగాడు సయ్యద్ అన్వర్‌కి ఓపెనర్లుగా చోటు ఇచ్చాడు. వెస్టిండీస్ విధ్వంస ఆటగాడు క్రిస్ గేల్‌కు వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి సెకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్ గా షకీబ్ చేర్చాడు. సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కలీస్‌ని ఐదో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా షకీబ్ ఎంచుకున్నాడు .
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తన టీమ్‌కి వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్ ఎంచుకున్నాడు. తన టీమ్‌లో తనకి ఆల్‌రౌండర్‌గా తనకి కూడా షకీబ్ చోటు కల్పించాడు. శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌కి తన టీమ్‌లో మరో స్పిన్నర్‌గా షకీబ్ చోటు ఇచ్చాడు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్‌కి తన టీమ్‌లో మూడో స్పిన్నర్‌గా షకీబ్ అల్ హసన్ ఎంచుకున్నాడు . ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను తన టీమ్‌లో ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా ఎంచుకున్నాడు. పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్‌కి షకీబ్ అల్ హసన్ జట్టులో ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా చోటు దక్కింది...
షకీబ్ అల్ హసన్ ఆల్ టైమ్ వన్డే XI ఇదే: సచిన్ టెండూల్కర్, సయ్యద్ అన్వర్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, జాక్వస్ కలీస్, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, వసీం అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్
చదవండి: Ravindra Jadeja: టీమిండియా ఓటమి.. ఆసుపత్రిలో చేరిన జడేజా
Comments
Please login to add a commentAdd a comment