సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌కు పాకిస్తాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ పాఠాలు చెప్పారు.
ముంబై : సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌కు పాకిస్తాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ పాఠాలు చెప్పారు. కోల్‌కతా జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న అక్రమ్... ముంబైతో మ్యాచ్ సందర్భంగా బుధవారం వాంఖడే స్టేడియంకు వచ్చారు. అక్కడ అర్జున్‌కు కొన్ని మెళకువలు నేర్పించారు. ‘గత వేసవిలో ఇంగ్లండ్‌లో అర్జున్ కలిశాడు. మేం ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా ఆడాం. తను బౌలింగ్ చేస్తున్నప్పుడు నేను మిడాన్‌లో ఫీల్డింగ్ చేశా.
ఆ మ్యాచ్ లో అర్జున్ లారాను అవుట్ చేశాడు’ అని అక్రమ్ చెప్పారు. 15 ఏళ్ల అర్జున్ ఎడమచేతి వాటం పేసర్. అక్రమ్ కూడా ఎడమచేతి వాటం బౌలర్. ‘తన యాక్షన్ గురించి, బంతిని స్వింగ్ చేసే విధానం గురించి మాట్లాడాను. అలాగే ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో వివరించాను. తనలో నేర్చుకోవాలనే తపన చాలా ఉంది’ అని అక్రమ్ చెప్పారు.