IPL 2023: Arjun Tendulkar Can Take Wickets And He Can Hit Sixes Too, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2023: సిక్సర్ల వర్షం కురిపించిన అర్జున్‌ టెండూల్కర్‌.. వీడియో వైరల్‌

Published Thu, Apr 20 2023 12:52 PM | Last Updated on Thu, Apr 20 2023 1:11 PM

Arjun Tendulkar Can Take Wickets And He Can Hit Sixes Too - Sakshi

PC: MI twitter

క్రికెట్ దిగ్గజం సచిన్ తనయుడు, ముంబై ఇండియన్స్‌ యువ పేసర్‌  అర్జున్ టెండూల్కర్ తొలి ఐపీఎల్‌ వికెట్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-2023లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ తొలి ఐపీఎల్‌ వికెట్‌ పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో అర్జున్‌ తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. 2.5 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్క వికెట్‌ సాధించాడు. దీంతో అతడిపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.

నెట్స్‌లో చెమటోడ్చుతున్న అర్జున్‌
ఇక అర్జున్‌ అర్జున్ టెండూల్కర్‌కు బౌలింగ్‌తో బ్యాటింగ్‌ కూడా చేసే సత్తా ఉంది. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అతడి పేరిట ఓ సెంచరీ కూడా ఉంది. కాగా ముంబై ఇండియన్స్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 22న వాంఖడే వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ముంబై చేరుకున్న రోహిత్‌ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

తమ నెట్‌ ప్రాక్టీస్‌లో భాగంగా అర్జున్ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే అర్జున్‌ బౌలింగ్‌ మాత్రమే కాకుండా బ్యాటింగ్‌పై కూడా దృష్టిపెట్టాడు. తమ బౌలర్లు బౌలింగ్‌ చేస్తుండగా అర్జున్‌ భారీ షాట్లు ఆడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IPL 2023: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్‌లో ఇంతే! తీసి పడేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement