
ముంబై: తన కుమారుడు భారత అండర్–19 జట్టులోకి ఎంపిక కావడం పట్ల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు. జులైలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం గురువారం సెలక్టర్లు ప్రకటించిన జట్టులో అర్జున్ టెండూల్కర్‌కు చోటు దక్కింది. దీనిపై సచిన్ స్పందిస్తూ... ‘భారత అండర్–19 జట్టులోకి అర్జున్ ఎంపిక కావడం పట్ల మేమందరం సంతోషంగా ఉన్నాం.
అతని క్రికెట్ కెరీర్‌లో ఇది కీలకమైన మైలురాయి. అతని ఇష్టాఇష్టాల్లో నాతో పాటు అంజలి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అర్జున్ విజయం సాధించాలని మేం ప్రార్థిస్తున్నాం’ అని పుత్రోత్సాహం ప్రదర్శించాడు.