టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 25000 పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా విరాట్ ఈ ఫీట్ సాధించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరుపై ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు.
కోహ్లి 549 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా.. సచిన్ 577 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును నెలకొల్పాడు. విరాట్, సచిన్ తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్ (588 మ్యాచ్‌లు), జాక్వెస్ కలిస్ (594 మ్యాచ్‌లు), కుమార సంగక్కర (608 మ్యాచ్‌లు) , మహేల జయవర్ధనే(701 మ్యాచ్‌లు) 25,000 పరుగులను పూర్తి చేశారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 64 పరుగులు చేశాడు.
ఆసీస్ చిత్తు.. భారత్ ఘన విజయం
ఇక ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. 115 స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 26. 4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది.
చతేశ్వర్ పూజారా(27), శ్రీకర్ భరత్(23) ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో 7 వికెట్లతో రవీంద్ర జడేజా ఆసీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అశ్విన్ మూడు వికెట్ల పడగొట్టాడు.
చదవండి: IND vs AUS: శభాష్ హిట్‌మ్యాన్.. పూజారా కోసం వికెట్‌ను త్యాగం చేసిన రోహిత్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment