హైదరాబాదీ పేస్ గన్ మహ్మద్ సిరాజ్‌పై దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. అతన్ని చూసిన ప్రతిసారి ఏదో కొత్తదనం కనిపిస్తుందంటూ ఆకాశానికెత్తాడు. కెప్టెన్ ఎప్పుడు అడిగినా లోడెడ్ గన్‌లా నిప్పులు చెరిగేందుకు రెడీగా ఉంటాడని కితాబునిచ్చాడు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ..
Thank you @sachin_rt sir for this . It is a huge motivation for me coming from you .. I will always do my best for my country .stay well sir https://t.co/3qJrCBkwxm
— Mohammed Siraj (@mdsirajofficial) December 22, 2021
సిరాజ్ బౌలింగ్ రనప్ అద్భుతంగా ఉంటుందని, మైదానంలో అతనెప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తాడని, అతను బౌల్ చేసేది తొలి ఓవరా లేక అఖరిదా అన్నది గుర్తించలేరని కొనియాడాడు. సిరాజ్‌లో ఈ లక్షణాలు తననెంతో అకట్టుకున్నాయని, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇదే తరహా యాటిట్యూడ్‌తో అతను సత్ఫలితాలు సాధించాడని పేర్కొన్నాడు.సిరాజ్‌లో వేగంగా నేర్చుకునే లక్షణం కనిపించిందని, అరంగేట్రం టెస్ట్‌లోనే అనుభవజ్ఞుడిలా బౌల్ చేశాడని, సీనియర్ల సలహాలతో మరింత మెరుగయ్యాడని కొనియాడాడు.
దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ కీలక బౌలర్‌గా అవతరిస్తాడని జోస్యం చెప్పాడు. కాగా, తనపై క్రికెట్ దిగ్గజానికి ఉన్న అభిప్రాయానికి సిరాజ్ కృతజ్ఞతలు తెలిపాడు. 'థాంక్యూ సచిన్ సర్. మీ నుంచి ఇలాంటి మాటలు రావడం నాకెంతో స్ఫూర్తిదాయకం. దేశం కోసం ఎప్పుడూ అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నిస్తాను. స్టే వెల్ సర్' అంటూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే, మూడు టెస్ట్‌ల సిరీస్ నిమిత్తం ప్రస్తుతం సిరాజ్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
చదవండి: ప్రముఖ బాలీవుడ్ నటుడికి దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన కేన్ మామ..!
Comments
Please login to add a commentAdd a comment