సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు నవంబర్ 20న క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అన్ని ఫార్మట్లలో కలిపి 30 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక ఈ రోజే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా కెరీర్‌లో 50 శతకాల రికార్డును నమోదు చేశాడు. అప్పుడు.. ఇప్పడు.. ప్రత్యర్థి శ్రీలంకే కావడం విశేషం అయితే రెండు రికార్డులు టెస్టు మ్యాచ్‌లో చివరిరోజు ఆటలో నమోదు కావడం మరో విశేషం.
అహ్మదాబాద్ వేదికగా 2009లో లంకతో జరిగిన టెస్టు చివరి రోజు ఆటలో 35వ పరుగుతో మాస్టర్ ఈ మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో 12,777, వన్డేల్లో17,178, టీ20ల్లో 10 పరుగులను కలుపుకొని ఈ ఘనత సాధించాడు. రిటైర్మెంట్ నాటికి మాస్టర్ మూడు ఫార్మట్లలో 34357 పరుగులు చేసి అత్యధిక పరుగుల నమెదు చేసిన క్రికెటర్లలో తొలిస్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర (28016) నిలిచాడు.
ఇక శ్రీలంకతో ఈడెన్ వేదికగా జరగుతున్న తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన కోహ్లి అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 50కి పెంచుకున్నాడు. టెస్టుల్లో 18 సెంచరీలు, వన్డేల్లో 32 సెంచరీలతో కోహ్లి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్ లో 50 సెంచరీలను సాధించిన ఆటగాళ్లలో కోహ్లి ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. నవంబర్ 20నే ఈ రెండు రికార్డులు నమోదు కావడంతో అభిమానులు ఈ రోజును టీమిండియా రికార్డ్స్‌డేగా పిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment