
రాయ్‌పూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ బ్యాట్స్‌మెన్ల ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్(42 బంతుల్లో 65; 6ఫోర్లు, 3సిక్సర్లు), సిక్సర్ల షాహెన్‌షా యువరాజ్ సింగ్(20 బంతుల్లో 49 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) పరుగుల వరదపారించారు. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(17 బంతుల్లో 35; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు ఆరంభానివ్వగా, సచిన్, కైఫ్(21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), యూసఫ్ పఠాన్(20 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), యువరాజ్ తమదైన మార్క్ షాట్లతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. విండీస్ బౌలర్ నగముత్తు వేసిన 19వ ఓవర్లో యువీ ఏకంగా నాలుగు సిక్సర్లు బాది 24 రన్స్ రాబట్టాడు. భారత బ్యాట్స్‌మెన్ల వీరవిహారం ధాటికి విండీస్ బౌలర్లు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment