రాయ్‌పూర్: రహదారి భద్రత ప్రపంచ టి20 సిరీస్ క్రికెట్ టోర్నీ తొలి సెమీఫైనల్లో ఇండియా లెజెండ్స్ 12 పరుగుల తేడాతో వెస్టిండీస్ లెజెండ్స్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 218 పరుగులు చేసింది. సెహ్వాగ్ (17 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), సచిన్ (42 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), యువరాజ్ (20 బంతుల్లో 49 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్సర్లు), పఠాన్(20 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కరీబియన్లకు చుక్కలు చూపించారు. ఇక్కడ చదవండి: వైరల్: శార్దూల్‌పై కోహ్లి అసహనం..!
తర్వాత విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసి లక్ష్యానికి దూరంగా నిలిచి ఓడిపోయింది. యువరాజ్ తమదైన మార్క్ షాట్లతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. విండీస్ బౌలర్ నగముత్తు వేసిన 19వ ఓవర్లో యువీ ఏకంగా నాలుగు సిక్సర్లు బాది 24 రన్స్ రాబట్టాడు. భారత బ్యాట్స్‌మెన్ల వీరవిహారం ధాటికి విండీస్ బౌలర్లు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment