ఐపీఎల్-2023లో టీమిండియా యువ ఆటగాడు, గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 60.79 సగటుతో 851 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు హాఫ్ సెంచరీలతో పాటు మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో కూడా గిల్ తన జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు.
ఇక ఇది ఇలా ఉండగా కీలకమైన ఫైనల్‌కు ముందు శుబ్‌మన్ గిల్‌పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది సీజన్‌లో గిల్ ప్రదర్శన ఎప్పటికీ మర్చిపోలేనదని సచిన్ కొనియాడాడు.
"ఈ ఏడాది సీజన్‌లో గిల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడి ఆటతీరు ఎప్పటికీ మర్చిపోలేం. అతడు మూడు సెంచరీలు సాధించాడు. అందులో రెండు సెంచరీలు గుజరాత్ ఫైనల్‌కు చేరుకోవడంలో తోడ్పడితే.. మరో సెంచరీ ముంబైకు అవకాశం కల్పించింది. అదే సెంచరీ ఆర్సీబీ కొంపముంచింది. ఈ జెంటిల్‌మెన్ గేమ్‌లో ఇటువంటివి సహజం. ముఖ్యంగా గిల్ బ్యాటింగ్ స్టైల్‌ను నన్ను బాగా అకట్టుకుంది. అతడు ఆడిన షాట్లు చాలా క్లాసిక్‌గా ఉన్నాయి. అదే విధంగా వికెట్ల మధ్య కూడా అతడు చాలా చురుకుగా పరిగెత్తతున్నాడు.
గుజరాత్ భారీ స్కోర్‌లు నమోదు చేయడంలో గిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒక్కసారి క్రీజులో సెట్ అయ్యాక ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక గుజరాత్ చాలా బలమైన జట్టు. గిల్, హార్దిక్, డేవిడ్ మిల్లర్ వికెట్లను చెన్నై సాధించగలిగితే.. గుజరాత్lio బ్యాక్‌ఫుట్‌లో ఉంచవవచ్చు. అదేవిధంగా ధోని కూడా తన బ్యాటింగ్ ఆర్డర్‌లో కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది" అని సచిన్ ట్విటర్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: చరిత్రకు అడుగు దూరంలో శుబ్‌మన్ గిల్.. అలా అయితే కోహ్లి రికార్డు బద్దలు!
Comments
Please login to add a commentAdd a comment