షూ కొనేందుకు డబ్బు లేదు.. అతడే ఆదుకున్నాడు: శార్దూల్‌ భావోద్వేగం | When I Did Not Have Money He Gave Shoes: Emotional Shardul On Retiring Kulkarni | Sakshi
Sakshi News home page

షూ కొనుక్కోవడానికీ డబ్బు లేదు.. అతడే ఆదుకున్నాడు: శార్దూల్‌ భావోద్వేగం

Published Mon, Mar 11 2024 1:01 PM | Last Updated on Mon, Mar 11 2024 2:33 PM

When I Did Not Have Money He Gave Shoes: Emotional Shardul On Retiring Kulkarni - Sakshi

“When I did not have money to buy shoes: ‘‘ఇదే తన చివరి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌. తనతో పాటు నాకు కూడా భావోద్వేగ సమయం. చిన్ననాటి నుంచే అతడి ఆటను గమనిస్తూ ఉన్నాను.  బౌలింగ్‌లో నాకెన్నో నైపుణ్యాలు నేర్పించాడు.

అంతేకాదు.. షూ కొనడానికి నా దగ్గర డబ్బు లేని సమయంలో.. తన దగ్గర ఉన్న బూట్ల జతలు నాకు ఇచ్చాడు. కెరీర్‌ ఆరంభంలో నాకెంతో సహాయం చేశాడు’’ అని టీమిండియా క్రికెటర్‌, ముంబై ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఉద్వేగానికి లోనయ్యాడు.

కాగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌ ఫైనల్‌కు చేరుకున్న ముంబై.. టైటిల్‌ కోసం విదర్భతో పోటీ పడుతోంది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ మొదలైంది. టాస్‌ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్‌ చేసింది.

ఓపెనర్లు పృథ్వీ షా(46), భూపేన్‌ లల్వాణి(37) మెరుగైన ఆరంభమే అందించినా.. విదర్భ బౌలర్ల దెబ్బకు మిడిలార్డర్‌ కుప్పకూలింది. ఫలితంగా 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దుల్‌ ఠాకూర్‌ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) విదర్భ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 

కేవలం 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన శార్దుల్‌ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 224 పరుగుల వద్ద ముంబై తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. అనంతరం.. తొలి రోజే బ్యాటింగ్‌కు దిగిన విదర్భను ముంబై పేసర్‌ ధవళ్‌ కులకర్ణి దెబ్బకొట్టాడు.


ధవళ్‌ కులకర్ణిని అభినందిస్తున్న సహచరులు (PC: PTI)

మరో పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ కూడా రాణించాడు. తొలిరోజు ఆట ముగిసే ధవళ్‌ రెండు, శార్దూల్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆట పూర్తయ్యేసరికి విదర్భ 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు మాత్రమే చేసింది.

ధవళ్‌ కులకర్ణి రిటైర్మెంట్‌
ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల ధవళ్‌ కులకర్ణి ఈ మ్యాచ్‌ తర్వాత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి కూడా సెలవు తీసుకోకున్నాడు. ఇప్పటికే రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించిన ఈ రైటార్మ్‌ పేసర్‌.. మోహిత్‌ అవస్థి గాయం కారణంగా విదర్భతో ఫైనల్‌ మ్యాచ్‌ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఈ నేపథ్యంలో తొలి రోజు ఆట అనంతరం శార్దూల్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ధవళ్‌ కులకర్ణితో తన అనుబంధం గురించి గుర్తుచేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను బాధపడిన సమయంలో కులకర్ణి తనకు అండగా నిలబడ్డాడంటూ అభిమానం చాటుకున్నాడు.

చదవండి: Ind vs Eng 2024: టీమిండియా నయా సంచలనాలు.. ధనాధన్‌ దంచికొట్టి హీరోలుగా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement