ఏ సినిమా తీసుకున్నా.. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఇలా అందరూ కీలకమే. కానీ యాక్టర్స్ ఎంత ఫెర్ఫార్మ్ చేసినా సరే దానికి సరిపోయే బ‍్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ లేకపోతే అసలు ఆ సినిమాలో జీవమే ఉండదు. అలా గత కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో తెలుగు సినిమాలకు ప్రాణం పోసిన వాళ్ల లిస్ట్ తీస్తే అందులో కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ కచ్చితంగా ఉంటారు. ఇప్పుడు వాళ్లకు జాతీయ అవార్డులు రావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది.
(ఇదీ చదవండి: 'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?)
ఆస్కార్ ప్లస్ ఈ అవార్డ్
కీరవాణి పేరు చెప్పగానే అద్భుతమైన పాటలు, గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొస్తుంది. అప్పట్లో అందరూ హీరోల సినిమాలకు పనిచేసిన ఈయన.. కొన్నాళ్ల నుంచి మాత్రం ఎందుకో బయట సినిమాలు బాగా తగ్గించేశారు. ఒకవేళ చేసినా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. కానీ బాహుబలి రెండు పార్ట్స్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. 'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు పాటతో ఆస్కార్ గెలిచారు. ఇప్పుడు అదే సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో జాతీయ అవార్డు సాధించారు.
(ఇదీ చదవండి: 69వ జాతీయ సినిమా అవార్డులు ఫుల్ లిస్ట్)
మాస్ కమ్‌బ్యాక్
మాస్, క్లాస్, రొమాంటిక్.. ఇలా ఏ పాటలకు ట్యూన్స్ కట్టాలన్నా అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్ పేరు వినిపించేది. కానీ తమన్‌తోపాటు మిగతా సంగీత దర్శకుల హవా ఎక్కువ కావడంతో దేవిశ్రీ ప్రసాద్ క్రేజ్ పడిపోయింది. దీంతో చాలామంది డీఎస్పీ పనైపోయిందనుకున్నారు. కానీ 'పుష్ప' పాటలతో వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించాడు. ఆ సాంగ్స్ వల్లే ఇప్పుడు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు.
సీనియర్ల అనుభవం
అయితే పైన ఇద్దరికీ జాతీయ అవార్డులు రావడం విశేషమే. కానీ వీళ్ల గురించి జనాలు మెల్లమెల్లగా మరిచిపోతున్న టైంలో అవార్డులు గెలిచి చూపించారు. సీనియర్ల అనుభవం.. ఇలాంటప్పుడు ఎలా పనికొస్తుందనేది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి చూపించారు. ఇప్పటి జనరేషన్ మాటల్లో చెప్పాలంటే.. ఇది కదా అసలైన కమ్‌బ్యాక్ అంటే అని అనొచ్చు. ఇక ఈ అవార్డులు ఇచ్చిన ఊపుతో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు చేస్తూ మంచి మ్యూజిక్ ఇవ్వాలని.. తెలుగు సంగీత ప్రియులు కోరుకుంటున్నారు.
(ఇదీ చదవండి: సిక్స్ కొట్టిన ఆర్‌ఆర్‌ఆర్.. ప్చ్.. ఆ ముగ్గురికి రాలేదే!)
Comments
Please login to add a commentAdd a comment