ఇండియాలో తెలుగు సినిమాల హవా కొనసాగుతుంది. దానికి నిదర్శనమే ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప ది రైజ్ వంటి చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులు అందుకున్నాయి. ఈ రెండు బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ రెండు సినిమాల గురించి బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా పలు వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రాలను తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలపై వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. అంతేకాకుండా ఆయనపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి.
(ఇదీ చదవండి: రూ. 29 లక్షల కేసు విషయంలో ఏఆర్ రెహ్మాన్‌పై ఫిర్యాదు)
ఈ మధ్య వస్తున్న సినిమాల్లో హీరోయిజాన్ని ఎక్కువగా చూపించడం కనిపిస్తోందని ఆయన తెలిపాడు. అమెరికాలోని మార్వెల్ చిత్రాలు కూడా ఇదే తరహాలోనే ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. అలాంటి పరిస్థితే భారత్‌లో కూడా ఇప్పుడు కనిపిస్తుందని చెప్పాడు. ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప ది రైజ్ చిత్రాలను ఇప్పటివరకూ చూడలేదంటూ ఈ చిత్రాల్లో హీరోయిజం ఎక్కువగా ఉందని ఆయన తెలిపాడు. ఇలాంటి చిత్రాలు చూసిన ప్రేక్షకులు కూడా థ్రిల్ అవుతున్నారని చెప్పుకొచ్చాడు. మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ చూశానని, ఆయన గొప్ప దర్శకుడని కొనియాడాడు. ఆయన ఎలాంటి అజెండాలు లేకుండా సినిమాలు చేస్తారని అందుకే ఆ సినిమా కూడా బాగా వచ్చిందని నసీరుద్దీన్ షా తెలిపాడు.
ఇక్కడ ఆయన మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప ది రైజ్ సినిమాలు చూడకుండానే సుకుమార్, రాజమౌళిని సర్టిఫై చేసిన నసీరుద్దీన్ షాను పలువురు విమర్శిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ తమిళనాడులో తప్ప ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ఆడలేదనే పాయింట్‌ను ఆయనకు గుర్తుచేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మన దేశానికి ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టింది మర్చిపోయారా అని చెబుతూనే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ జాతీయ అవార్డును దక్కించుకున్నాడని నెటిజన్లు ఆయనకు గుర్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment