![pushpa 2: Behind The Story Of Allu Arjun First Look Poster - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/9/pushpa2.jpg.webp?itok=DXugVMOb)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ‘పుష్ప 2’. రెండేళ్ల క్రితం విడుదలైన సంచలన విజయం సాధించిన ‘పుష్ప’సినిమాకు సీక్వెల్ ఇది. బన్ని బర్త్‌డే సందర్భంగా ఒక రోజు ముందే అంటే ఏప్రిల్ 7న ఈ చిత్రం నుంచి వేర్ ఈజ్ పుష్ప అనే స్పెషల్ వీడియోతో పాటు అల్లు అర్జున్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. అంతా ఊహించినట్లే వీడియో అదిరిపోయింది.
కానీ బన్నీ లుక్‌ని మాత్రం ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. ఎవరూ ఊహించని విధంగా అమ్మవారి గెటప్‌లో బన్నీ కనిపించాడు. చీరకట్టుకుని చేతులకు గాజులు వేసుకున్న ఆయన ఓ చేతిలో తుపాకీ పట్టుకుని కాళికా మాత రూపంలో దర్శనమిచ్చాడు. ఈ లుక్ సోషల్ మీడియాను ఊపేసింది. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ బన్ని లుక్ తెగ వైరల్ అయింది. కథలో భాగంగా ఇప్పుడు కూడా ఈ గెటప్ ని వేసినట్టు తెలుస్తోంది. ఈ కాళికామాత గెటప్ వెనుక పెద్ద కథనే దాగి ఉందట.
ఒకప్పుడు తిరుపతి పరిసర ప్రాంతాలను పాలెగాండ్లు పాలించేవారు. వారు ఏది చెబితే అదే చట్టం. మహిళలపై వాళ్లు చేసే అత్యాచారాలకు లెక్కే ఉండేది కాదట. నచ్చిన మహిళలను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవారట. వీళ్ల ఆగడాలను భరించలేక ప్రజలు అమ్మవారిని ప్రార్థించారట.దీంతో గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చిందట. ఆమె రూపాన్ని చూసి భయపడిపోయిన పాలెగాండ్లు అడవుల్లోకి పారిపోయారట.
దీంతో అక్కడున్న మగవాళ్లు కొందరు ఆడవాళ్లలా వేషం వేసుకుని వెళ్లి పాలెగాండ్లు పట్టుకుని వస్తే.. అమ్మవారు వారిని సంహరించేదట. ఆ ప్రభావంతో ఆడవారిపై అఘాయిత్యాలు తగ్గిపోయాయి. అప్పటి నుంచి తిరుపతి, అక్కడి సమీపంలోని ప్రజలు గంగమ్మ జాతరను నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆ ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ కథ ఆధారంగానే పుష్ప 2 ఉండబోతుందని సమాచారం. అడవిలో ఉన్న విలన్స్ ని చంపడానికి పుష్పరాజ్ కాళికా మాతలా మారి దుష్ట సహారం చేస్తాడట. ఈ గెటప్ లో క్లైమాక్స్ ఫైట్ ని సెట్ చేశాడట సుకుమార్. ఇదే కనుక నిజం అయితే పుష్ప 2 క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment