![RGV At Badava Rascal Pre Release Event - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/18/RGV.gif.webp?itok=huX9--5R)
‘‘మన విలువను అవతలివాడు గుర్తించడు.. మనమే గుర్తించుకోవాలి’ అని రచయిత జావేద్ అక్తర్‌గారు నాతో చెబుతుండేవారు. ఆ మాటను ధనుంజయ్ నిజం చేశాడు. అదే అతనికి డబుల్ సక్సెస్’’ అన్నారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. ‘భైరవగీత, మను చరిత్ర, పుష్ప’ వంటి సినిమాల్లో నటించిన కన్నడ నటుడు ధనుంజయ్ హీరోగా నటించిన చిత్రం ‘బడవ రాస్కెల్’.
శంకర్ గురు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమృత అయ్యంగార్ హీరోయిన్. గీతా శివరాజ్‌కుమార్ సమర్పణలో సావిత్రమ్మ అడవి స్వామి నిర్మించిన ఈ చిత్రం కన్నడలో గత ఏడాది విడుదలైంది. ‘బడవ రాస్కెల్’ పేరుతోనే నేడు తెలుగులో రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా రిజ్వాన్ విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి రామ్‌గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధనుంజయ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. ఇక నుంచి తెలుగులో కూడా నేను రెగ్యులర్‌గా సినిమాలు చేస్తాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment