టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను సైతం ఊపేసిన సినిమా 'పుష్ప- ది రైజ్'. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అందాల భామ రష్మికతో బన్నీ స్టెప్పులు యూత్‌ను ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని సాంగ్స్ దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందాయి. పుష్ప సినిమాతో అల్లుఅర్జున్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు.
(చదవండి: క్రేజీ అప్‌డేట్.. ఆ రోజు నుంచే ‘పుష్ప-2’ రెగ్యులర్ షూటింగ్!)
ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ ఈ సినిమాపై ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడతూ 'పుష్ప మూవీ ఇంతపెద్ద విజయం సాధిస్తుందనుకోలేదు. ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ చిత్రంలో నేను లేకుంటే ఇంత ప్రేమను పొందడానికి నాకు దాదాపు 20 సంవత్సరాలు పట్టేది. 'పుష్ప-2' పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ప్రయత్నిస్తాం' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment