ప్రస్తుతం దేశమంతా పుష్ప 2 ఫీవరే నడుస్తుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డుని సృష్టించి బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, ప్రభాస్‌ల పేరు మీదున్న రికార్డుని బ్రేక్ చేశాడు. ముఖ్యంగా ఈ మూవీలో ఆయన డైలాగులు, ఆహార్యం, ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. స్టైలిష్ స్టార్ స్టెప్పులు, ఫిజికల్ అపీరియన్స్‌కే ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు. ముఖ్యంగా హై ఎనర్జీతో కూడిన పెర్ఫార్మెన్స్‌కి ఎవ్వరైనా.. ముగ్గులైపోవాల్సిందే. అలా ఉంటుంది ఆయన నటన. మరి చూడటానికి ఆకర్షణీయంగా, ఆజానుబాహుడిలా ఉండే మన పుష్ప2 హీరో ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా..!
పుష్ప మూవీలో డైలాగ్ మాదిరిగా.. "అల్లు అర్జున్ డైట్ అంటే నార్మల్ అనుకుంటివా అత్యంత హెల్తీ". ఆయన చెప్పే డైలాగులు..స్టెప్పులు అత్యంత వేగంగా ఉంటాయి. ప్రేక్షకుడిని అటెన్షన్‌తో వినేలా చేస్తాయి. అంతలా శక్తిమంతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే మంచి ఆరోగ్యకరమైన డైట్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అందుకోసం హీరో అల్లు అర్జున్ ఈ ఎనిమిది చిట్కాలను తప్పనిసరిగా పాటిస్తారట. అవేంటంటే..
బన్నీ రోజు.. వ్యాయామాలు, వర్కౌట్‌లతోనే ప్రారంభమవుతుందట. అందువల్ల ఉదయాన్నే హై ప్రోటీన్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌నే తీసుకుంటారట. దీని కారణంగానే ఆయన రోజంతా చురుకుగా ఉంటారు
తప్పనిసరిగా అల్పాహారంలో గుడ్లు ఉండాల్సిందేనట. కండలు తిరిగిన దేహానికి అవసరమైన ప్రోటీన్ ఇందులో ఉంటుంది. ఇవి కండరాలను బలోపతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
ఇక లంచ్‌లో తప్పనిసరిగా గ్రిల్డ్ చికెన్ ఉండాల్సిందే. దీనిలోని లీన్ ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి, జీవక్రియను పెంచడానికి తోడ్పడుతుంది.
అలాగే ఆకుపచ్చని కూరగాయలను కూడా డైట్‌లో చేర్చకుంటారు. దీనిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, చర్మ సంరక్షణకు, మెరుగైన జీర్ణక్రియకు దోహదపడతాయి.
హైడ్రేటెడ్‌గా ఉండేలా ఫ్రూట్ జ్యూస్‌లు, సలాడ్‌లు, షేక్‌లు కూడా తీసుకుంటారు. దీని ద్వారా శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్లు అందుతాయి.
డిన్నర్ దగ్గరకి వచ్చేటప్పటికీ చాలా తేలికైన ఆహారమే తీసుకుంటారు. బ్రౌన్‌రైస్, కార్న్, గ్రీన్ రైస్ , సలాడ్లు ఉండేలా చూసుకుంటారు.
చివరగా అల్లు అర్జున్‌లా మంచి పిట్‌నెస్‌తో ఉండాలంటే..వ్యాయమాలను స్కిప్ చేసే ధోరణి ఉండకూడదు. సమతుల్యమైన డైట్‌ని తీసుకోవాలి. అలాగే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలతోపాటు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యం నిబద్ధతతో ఫిట్‌నెస్ లక్ష్యాన్ని చేరుకునేలా డైట్‌ని అనుసరిస్తే.. పుష్ప హీరోలాంటి లుక్‌ని ఈజీగా సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment