![Indian Dance Group Performs To Allu Arjun Eyy Bidda On America's Got Talent - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/29/allu-arjun.jpg.webp?itok=0jgg_FB9)
'ఇండియన్ డ్యాన్స్ గ్రూప్ వారియర్ స్క్వాడ్' ఇటీవల 'అమెరికాస్ గాట్ టాలెంట్'లో ఆడిషన్స్ ఇచ్చి అక్కడ సెలక్ట్ అయింది. హర్యానాకు చెందిన గురుగ్రామ్‌లో ఓ చిన్న గ్రామం నుంచి ఆ టీమ్ అమెరికా చేరుకుంది. వారు చేసిన డ్యాన్స్‌ను చూసి ఆ షో జడ్జిలంతా ఆశ్చర్యపోయారు. షో చూసేందుకు వచ్చిన వారందరూ కూడా వీరి డ్యాన్స్‌కు ఫిదా అయిపోయారు. షోలో జడ్జీలుగా వ్యవహిరిస్తున్న వారందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
(ఇదీ చదవండి: 'తీవ్రమైన ఇన్ఫెక్షన్'తో ఆసుపత్రి పాలైన ప్రముఖ సింగర్)
ఇంతలా వారందరిని మెప్పించిన ఈ గ్రూపు ఎంచుకున్న పాట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రంలోనిది కావడం విశేషం. 'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' పాట సాయంతో వారు డేంజరస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తాజాగా ఈ గ్రూప్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
న్యాయనిర్ణేతలు ఏమన్నారంటే..
షో జడ్జీలు అయినటువంటి హెడీ క్లమ్, సోఫియా వెర్గారా, సైమన్ కోవెల్ ఈ ఇండియన్ డ్యాన్స్ గ్రూప్ ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయారు. సోఫియా వారిని మెచ్చుకుంటూ.. 'మీరందరూ చాలా గొప్ప ప్రదర్శన ఇచ్చారు. మీరు గ్రూప్‌గా ఉన్న కూడా అందరూ ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఇది నిజంగా మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.' అని చెప్పింది. అదే సమయంలో.. మీకు పోటీ లేదు. మీరు చేసిన డ్యాన్స్ అద్భుతమైనది అని హెడీ అన్నారు.
(ఇదీ చదవండి: RRR: ఆస్కార్ సభ్యుల జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయంటే)
హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఒక చిన్న గ్రామం నుంచి వచ్చామని, ఒక NGO సహాయంతో అమెరికాలో ప్రదర్శన ఇచ్చే అవకాశం వచ్చిందని ఆ డ్యాన్స్ గ్రూప్ లీడర్ తెలిపాడు. వారికి అయ్యే ఖర్చులన్ని ఆ సంస్థే భరించిందని వారు తెలిపారు. 'అమెరికాస్ గాట్ టాలెంట్' పేరుతో అక్కడ 18వ సీజన్ తాజాగా ప్రారంభమైంది. మొదటి సీజన్ 2006లో ప్రసారమైంది. అక్కడ గెలుపొందిన వారికి భారిగానే ప్రైజ్ మనీ అందుతుంది. మన 'ఇండియన్ డ్యాన్స్ గ్రూప్ వారియర్ స్క్వాడ్' అక్కడ 'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' అంటూ బన్నీ పాటతో అదరగొడుతుంది.
THAT WAS AMAZING! @TheWarriorsInd2 is fearless! #AGT 🔥🔥🔥pic.twitter.com/dwKlqQxATu
— Terry Crews (@terrycrews) June 21, 2023
Comments
Please login to add a commentAdd a comment