
పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్‌గా మారింది రష్మిక. ఈ చిత్రంలో గ్రామీణ యువతి శ్రీవల్లిగా రష్మిక అదరగొట్టేసింది. ఒకే ఒక చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో రష్మికకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు రావడంతో ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ ఫుల్ బిజీగా మారిపోయింది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. అప్పుడప్పుడు ప్రత్యేక పాత్రల్లోనూ కనిపించి అభిమానులను అలరిస్తుంది.
తాజాగా ‘సీతారామం’చిత్రంలో ఓ స్పెషల్ క్యారెక్టర్‌లో కనిపించి ఆకట్టుకుంది రష్మిక. ఈ చిత్రంలో ముస్లిం యువతి అఫ్రిన్ పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇలా వరుస హిట్లతో దూసుకెళ్తూ తన గ్రాఫ్‌ని పెంచుకున్న రష్మిక.. తాజాగా తన రెమ్యునరేషన్‌ని కూడా హైక్ చేసిందట.
పుష్ప కంటే ముందు రూ. కోటి పారితోషికం తీసుకున్న రష్మిక..ఇప్పుడు ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేస్తుందట. బాలీవుడ్ సినిమాలకు రూ.4 కోట్లు, తెలుగు సినిమాలకు రూ.3 కోట్లు రెమ్యుషనరేషన్‌గా ఇవ్వాలని నిర్మాతలకు చెబుతోందట. ప్రస్తుతం రష్మికకు పాన్ ఇండియాలో ఉన్న స్టార్డం చూసి అంత మొత్తంలో పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే చెబుతున్నారట.
అయితే ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కాని, సినిమా మేకింగ్ ఖర్చులు తగ్గించుకునేందుకు నిర్మాతలు ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు స్టార్ హీరోహీరోయిన్లు రెమ్యునరేషన్ పెంచడం పట్ల రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది నటీనటుల స్థాయిని, ప్రస్తుతం ఉన్న క్రేజ్‌కి తగ్గట్టుగా రెమ్యునషరేషన్ ఇస్తే తప్పేంటని అంటుంటే.. మరికొంతమంది ఏమో అంత భారీ పారితోషికాలు ఇవ్వడం అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment