
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌ను తొమ్మిది నెలల కిందే సాక్షి మీడియా గ్రూప్ ఎక్స్‌లెన్స్ అవార్డ్‌తో సత్కరించింది. పుష్ప సినిమాలో వినూత్నమైన నటనతో పాటు తెలుగు అభిమానులను అత్యద్భుతంగా అలరించినందుకు ఎక్స్‌లెన్స్ అవార్డ్‌తో గౌరవించింది.
ఆ సందర్భంగా మాట్లాడిన స్టైలిష్ స్టార్.. సాక్షి మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్‌కు థ్యాంక్యూ చెప్పారు. సాక్షి ఇచ్చిన ఎక్స్‌లెన్స్ అవార్డ్‌ను మూవీ టీంకు డెడికేట్ చేస్తున్నట్లు చెప్పారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్‌లో అల్లు అర్జున్‌కు మోస్ట్ పాపులర్ హీరో అవార్డ్..
Comments
Please login to add a commentAdd a comment