Super Singer Fame Rajalakshmi Criticized Samyutha And Vishnukanth Divorce, Deets Inside - Sakshi
Sakshi News home page

Singer Rajalakshmi: సానుభూతి కోసమే విమర్శలు.. బుల్లితెర జంటపై మండిపడ్డ పుష్ప సింగర్!

Published Sun, Jun 25 2023 9:21 PM | Last Updated on Mon, Jun 26 2023 12:42 PM

Super Singer fame Rajalakshmi criticized Samyutha and Vishnukanth Divorce - Sakshi

బుల్లితెర జంట సంయుత, విష్ణుకాంత్ తమిళంలో బాగా ఫేమస్ అయ్యారు. సిప్పికుల్ ముత్తు అనే తమిళ టీవీ షోలో కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డ ఈ జంట ఏడు నెలల పాటు డేటింగ్‌లో ఉన్నారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఏడాది మార్చి 3, 2023న వివాహం చేసుకున్నారు. కానీ ఎంత తొందరగా ప్రేమలో పడ్డారో.. అంతే తొందరగా విడిపోయారు. పెళ్లయిన 15 రోజులకే ఈ జంట తమ బంధానికి గుడ్ బై చెప్పారు. దీంతో ఈ టాపిక్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

(ఇది చదవండి: వేణుస్వామితో మరో హీరోయిన్ స్పెషల్ పూజలు)

అయితే తాజాగా ఈ జంట విడిపోవడంపై మాజీ సూపర్ సింగర్ కంటెస్టెంట్ రాజలక్ష్మి స్పందించారు. ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకున్నాక ఒకరినొకరు బహిరంగంగా దూషించుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సంయుత, విష్ణుకాంత్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల పంచాయతీ కోలీవుడ్‌లో మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. 

కాగా.. గతంలో ఈ జంట ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. తన మాజీ భర్త అసభ్యకరమైన వీడియోలను చూపించేవాడని సంయుత ఆరోపించింది. విష్ణుకాంత్ కేవలం శారీరక సంబంధంపైనే ఆసక్తి చూపుతున్నాడని సంయుత ఆరోపించింది. బెడ్‌ రూమ్‌లో కెమెరాలు పెట్టాడని తీవ్రమైన ఆరోపణలు చేసింది. కానీ మరోవైపు తాము విడిపోవడానికి సంయుత తండ్రే ప్రధాన కారణమని విష్ణుకాంత్ విమర్శలు చేశారు. ఆమెకు మరొకరితో సంబంధం ఉందని ఆరోపించాడు. దీంతో ఈ బుల్లితెర జంట విడాకులపై సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి)

రాజలక్ష్మి ఎవరంటే?
కాగా.. రాజలక్ష్మి అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప: ది రైజ్‌లోని సామి సామి తమిళ వెర్షన్‌ని పాడినందుకు ఫేమ్ తెచ్చుకుంది. జానపద గాయని అయిన రాజలక్ష్మి త్వరలో కథానాయికగా నటనలో రంగ ప్రవేశం చేయబోతోంది. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన ‘సూపర్ సింగర్’ షోలో సెంథిల్, రాజలక్ష్మి దంపతులు పల్లెటూరి పాటలతో ఫేమస్ అయ్యారు. పల్లెటూరి పాటలు, సూపర్ సింగర్ ప్రోగ్రాం తర్వాత విదేశాల్లో కచేరీలు, కొన్ని తమిళ సినిమాల్లోనూ పాటలు పాడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement