Rajalakshmi
-
చెన్నై 'పుష్ప'గాడి ఈవెంట్లో ముగ్గురు స్టార్స్.. ఎవరో తెలుసా..?
పుష్పగాడి మాస్ జాతర కొనసాగుతుంది. పట్నాలో ఏర్పాటు చేసిన పుష్ప సినిమా ట్రైలర్ ఈవెంట్‌కు సుమారు 2 లక్షల మందికిపైగానే తరలివచ్చారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప2 మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చాలా గ్రాండ్‌గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 24న పుష్ప వైల్డ్‌ఫైర్ ఈవెంట్ పేరుతో చెన్నైలో మరో భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా ముగ్గురు సింగర్స్ ఉండనున్నారు.పట్నాలో జరిగిన ట్రైలర్ కార్యక్రమంలో భోజ్‌పురి స్టార్ సింగర్ అక్షర సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే, చెన్నై వేదికగా ఆదివారం సాయింత్రం 5గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ముగ్గురు సింగర్స్ దుమ్మురేపనున్నారు. వారిలో ఇద్దరూ పుష్ప-1 సినిమాలో తమిళ్ వర్షన్‌కు సంబంధించి రెండు సూపర్ హిట్ సాంగ్స్ పాడినవారు కావడం విశేషం. ఆండ్రియా జర్మియా (ఊ సోల్రియా మావా), రాజలక్ష్మి (సామీ సామీ ) సాంగ్స్‌తో మెప్పించిన వారైతే.. పార్ట్2లో 'కిస్సిక్' అనే పాటను ఆలపించిన సుబ్లాషిని వేదికపైన సందడి చేయనున్నారు.ఆండ్రియా నటిగా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే.. ఈ ఏడాదిలో వెంకటేష్ నటించిన సైంధవ్ చిత్రంలో ఆమె మెప్పించిన విషయం తెలిసిందే. రాజలక్ష్మి కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫాలో అయ్యే వాళ్లకు పరిచయమేనని చెప్పవచ్చు. ‘కిస్సిక్’ అనే సాంగ్ ఆదివారం రాత్రి 7:02గంటలకు విడుదల కానుంది. ఈ పాటను తెలుగు, తమిళ్, కన్నడలో ఆలపించిన సుబ్లాషిణి అక్కడ లైవ్ ఫర్ఫామ్ చేయనుంది. చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియం, సాయి రామ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ కార్యక్రమం జరగనుంది. డిసెంబరు 5న పుష్పరాజ్ మీ ముందుకు రాబోతున్నాడు. -
‘పుష్ప’ఫేం రాజలక్ష్మీ నోట ‘ఇంటి నెం.13’ పాట
కాలింగ్‌బెల్, రాక్షసి చిత్రాలతో ఆడియన్స్‌ని థ్రిల్ చేసిన పన్నా రాయల్ తెరెకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఇంటి నెం.13’. నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్‌రాజ్, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్, నెల్లూరు సుదర్శన్, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే ఆడియన్స్‌లో ఒక బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్ సాంగ్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ‘పుష్ప’ తమిళ్ వెర్షన్‌లోని ‘సామీ..’ పాటను పాడిన రాజలక్ష్మీ ఈ ప్రమోషనల్ సాంగ్‌ను ఎంతో హుషారుగా ఆలపించారు. ఈ పాటలోనే మేకింగ్ విజువల్స్‌ను కూడా జోడించారు. డైరెక్టర్ పన్నా రాయల్ మాట్లాడుతూ ‘సినిమా కాన్సెప్ట్‌ను, మేకింగ్‌ను తెలియజేసే ఒక ప్రమోషనల్ సాంగ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. అయితే ఎవరితో ఈ పాటను పాడించాలా అని ఆలోచిస్తున్నప్పుడు ‘పుష్ప’ తమిళ్ వెర్షన్లో ‘సామి..’ పాటను పాడిన రాజలక్ష్మీ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించడం జరిగింది. ఆమె ఎంతో హుషారుగా, మరెంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. ఈ వీడియోలో మేకింగ్ విజువల్స్‌ని కూడా జోడించడం వల్ల పాటకు ఒక కొత్త అందం వచ్చింది. ఈ పాట మా సినిమా ప్రమోషన్‌కి ఎంతో ఉపయోగపడుతుందన్న నమ్మకం మాకు ఉంది. మార్చి 1న విడుదలవుతున్న మా ‘ఇంటి నెం.13’ చిత్రానికి ఘన విజయాన్ని చేకూర్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. ‘తెలుగు ఆడియన్స్ ఇప్పటివరకు చూడని ఒక కొత్త తరహా చిత్రం ‘ఇంటి నెం.13’. ఈ సినిమా డెఫినెట్‌గా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తుంది’ అని నిర్మాత హేసన్ పాషా అన్నారు. -
పెళ్లయిన 15 రోజులకే విడాకులు.. బుల్లితెర జంటపై సింగర్ విమర్శలు!
బుల్లితెర జంట సంయుత, విష్ణుకాంత్ తమిళంలో బాగా ఫేమస్ అయ్యారు. సిప్పికుల్ ముత్తు అనే తమిళ టీవీ షోలో కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డ ఈ జంట ఏడు నెలల పాటు డేటింగ్లో ఉన్నారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఏడాది మార్చి 3, 2023న వివాహం చేసుకున్నారు. కానీ ఎంత తొందరగా ప్రేమలో పడ్డారో.. అంతే తొందరగా విడిపోయారు. పెళ్లయిన 15 రోజులకే ఈ జంట తమ బంధానికి గుడ్ బై చెప్పారు. దీంతో ఈ టాపిక్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. (ఇది చదవండి: వేణుస్వామితో మరో హీరోయిన్ స్పెషల్ పూజలు) అయితే తాజాగా ఈ జంట విడిపోవడంపై మాజీ సూపర్ సింగర్ కంటెస్టెంట్ రాజలక్ష్మి స్పందించారు. ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకున్నాక ఒకరినొకరు బహిరంగంగా దూషించుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సంయుత, విష్ణుకాంత్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల పంచాయతీ కోలీవుడ్‌లో మరింత హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. గతంలో ఈ జంట ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. తన మాజీ భర్త అసభ్యకరమైన వీడియోలను చూపించేవాడని సంయుత ఆరోపించింది. విష్ణుకాంత్ కేవలం శారీరక సంబంధంపైనే ఆసక్తి చూపుతున్నాడని సంయుత ఆరోపించింది. బెడ్ రూమ్‌లో కెమెరాలు పెట్టాడని తీవ్రమైన ఆరోపణలు చేసింది. కానీ మరోవైపు తాము విడిపోవడానికి సంయుత తండ్రే ప్రధాన కారణమని విష్ణుకాంత్ విమర్శలు చేశారు. ఆమెకు మరొకరితో సంబంధం ఉందని ఆరోపించాడు. దీంతో ఈ బుల్లితెర జంట విడాకులపై సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి) రాజలక్ష్మి ఎవరంటే? కాగా.. రాజలక్ష్మి అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప: ది రైజ్‌లోని సామి సామి తమిళ వెర్షన్‌ని పాడినందుకు ఫేమ్ తెచ్చుకుంది. జానపద గాయని అయిన రాజలక్ష్మి త్వరలో కథానాయికగా నటనలో రంగ ప్రవేశం చేయబోతోంది. ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారమైన ‘సూపర్ సింగర్’ షోలో సెంథిల్, రాజలక్ష్మి దంపతులు పల్లెటూరి పాటలతో ఫేమస్ అయ్యారు. పల్లెటూరి పాటలు, సూపర్ సింగర్ ప్రోగ్రాం తర్వాత విదేశాల్లో కచేరీలు, కొన్ని తమిళ సినిమాల్లోనూ పాటలు పాడుతున్నారు. 🔴 ஆபாச Video காட்டி அதே மாதிரி பண்ண சொல்லி அடிச்சாரு - Samyutha Family Interview | Vishnukanth#Samyutha #SamyuthaFamilyInterview #Vishnukanth #samyukthainterviewaboutdivorce pic.twitter.com/IIlI0rN8PY — SS Music (@SSMusicTweet) May 31, 2023 Dear samyutha, Vishnukanth Unga sandaya phone la pesunga, pudikalaya divorce vangikonga. YouTube la kadupethathinga, thank you. — Nivin (@niivinn) May 24, 2023 ஒருத்தரை பிடிக்கல, அவர்கூட வாழ முடியாதுனு விவாகரத்து வரைக்கும் போனப்பிறகு, பொதுவுல மாறி மாறி ஒருத்தரை ஒருத்தர் ரொம்ப மோசமா திட்டி வீடியோ போட்டுட்டு இருக்காங்க. தன்னை யாருக்கு நிரூபிக்கனும் 🤷🤷 samyutha vishnukanth — ராட்சசி 2.0 🐝🐝 (@imthattaan) May 19, 2023 -
జాగింగ్‌కు వెళ్లిన టెక్ సీఈవో.. కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే..
ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ప్రైవేట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'రాజలక్ష్మి విజయ్ రామకృష్ణన్' ఆదివారం ఉదయం మరణించారు. వర్లీ సముద్ర తీరంలో ఆమె జాగింగ్ చేస్తుండగా కారు ఆమెను ఢీకొట్టడం వల్ల మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆల్ట్రుయిస్ట్ టెక్నాలజీస్ (Altruist Technologies) బాస్ రాజలక్ష్మి విజయ్ ఆరోగ్యం పట్ల ఎప్పుడు శ్రద్ధ వహిస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ప్రతి రోజూ జాగింగ్ చేస్తూ ఉండే రాజలక్ష్మి 2023 టాటా ముంబయి మారథాన్ పూర్తి చేసింది. అయితే నిన్న అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించడం కుటుంబసభ్యులను ఒక్కసారిగా శోకసంద్రంలో ముంచేసింది. జాగింగ్ చేస్తున్న సమయంలో కారు వేగంగా వచ్చి ఆమెను ఢీ కొట్టడం వల్ల తలకు తీవ్రంగా గాయాలయ్యాయి, దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో ఈ పని చేసి ఉండవచ్చని పొలిసులు భావిస్తున్నారు. ఒక టెక్ కంపెనీ సీఈఓ చనిపోవడంతో ముంబయి టెక్ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రాజలక్ష్మి విజయ్ రామకృష్ణన్ మృతికి కారణమైన డ్రైవర్ సుమెర్ ధర్మేష్ మర్చంట్‌గా గుర్తించారు, ఇప్పటికే అతని మీద వివిధ కేసులు నమోదైనట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతే కాకుండా అతడు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పని చేస్తున్నట్లు, తన ఇంట్లో పార్టీ జరిగిన తరువాత తన ఫ్రెండ్‌తో కలిసి మహిళా సహోద్యోగిని ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీనిపైన ఇంకా సమగ్రమైన విచారణ జరుగుతోంది. -
ప్రాణం తీసిన వడ్డీ వ్యాపారం
♦ నగల కోసం మహిళ హత్య ♦ పోలీసుల అదుపులో నిందితుడు చిత్తూరు అర్బన్ : అధిక వడ్డీలు ఓ మహిళ ప్రాణాలు తీశాయి. చిత్తూరు నగరంలోని తోటపాళ్యంలో వివాహిత మంగళవారం హత్యకు గురైంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చిత్తూరుకు చెందిన రాజలక్ష్మి (44) నికంగా వడ్డీ వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలో నగరంలోని శంకరయ్యగుంటకు చెందిన జయకుమార్ అనే వ్యక్తితో రాజలక్ష్మికి పరిచయమైంది. వ్యాపార నిమిత్తం జయకుమార్ ఐదేళ్ల క్రితం రూ.2 లక్షలను రాజలక్ష్మి వద్ద అప్పుగా తీసుకున్నాడు. ఇందుకు గాను తన ఇల్లు, బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టాడు. అప్పు సక్రమంగా చెల్లించకపోవడంతో రాజ్యలక్ష్మి చట్ట ప్రకారం జయకుమార్ ఇంటిని, ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. సోమవారం రాత్రి రాజలక్ష్మి ఇంటికి వెళ్లిన జయకుమార్ ‘అధిక వడ్డీకి ఇంటిని స్వాధీనం చేసుకున్నావ్.. కనీసం నా భార్య నగలైనా ఇచ్చేయ్’ అని ప్రాధేయపడ్డాడు. ఆమె ఇవ్వలేదు. భార్యతో కలిసి ఓ వివాహానికి వెళ్లాలని, బంగారు నగలు ఓ సారి ఇస్తే మళ్లీ ఇచ్చేస్తానని చెప్పినా ఆమె అంగీకరించలేదు. మంగళవారం ఉదయం అతను మళ్లీ ఆమె వద్దకు వెళ్లి రాజలక్ష్మితో వాదనకు దిగాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న లారీ బోల్టులు తీసే రాడ్‌తో రాజలక్ష్మి తలపై కొట్టి చంపేశాడు. అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన జయకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చిత్తూరు డీఎస్పీ సుబ్బారావు, టూటౌన్ సీఐ వెంకటప్ప వేలిముద్రల సేకరణ విభాగపు సిబ్బంది పలు ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.