‘పుష్ప’ఫేం రాజలక్ష్మీ నోట ‘ఇంటి నెం.13’ పాట | Inti Number 13 Movie Promotional Song By Pushpa Song Fame Senthil Rajalakshmi, Watch Video Inside - Sakshi
Sakshi News home page

Inti Number 13 Promotional Song: ‘పుష్ప’ఫేం రాజలక్ష్మీ నోట ‘ఇంటి నెం.13’ పాట

Published Sat, Feb 24 2024 6:19 PM | Last Updated on Sat, Feb 24 2024 6:42 PM

Inti Number 13 Promotional Song Out - Sakshi

కాలింగ్‌బెల్‌, రాక్షసి చిత్రాలతో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసిన పన్నా రాయల్‌ తెరెకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఇంటి నెం.13’. నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌, నికీషా, ఆనంద్‌రాజ్‌, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్‌, నెల్లూరు సుదర్శన్‌, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ ఇప్పటికే ఆడియన్స్‌లో ఒక బజ్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ ఇప్పుడు  నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ‘పుష్ప’ తమిళ్‌ వెర్షన్‌లోని ‘సామీ..’ పాటను పాడిన రాజలక్ష్మీ ఈ ప్రమోషనల్‌ సాంగ్‌ను ఎంతో హుషారుగా ఆలపించారు. ఈ పాటలోనే మేకింగ్‌ విజువల్స్‌ను కూడా జోడించారు.

డైరెక్టర్‌ పన్నా రాయల్‌ మాట్లాడుతూ ‘సినిమా కాన్సెప్ట్‌ను, మేకింగ్‌ను తెలియజేసే ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. అయితే ఎవరితో ఈ పాటను పాడించాలా అని ఆలోచిస్తున్నప్పుడు ‘పుష్ప’ తమిళ్‌ వెర్షన్‌లో ‘సామి..’ పాటను పాడిన రాజలక్ష్మీ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించడం జరిగింది. ఆమె ఎంతో హుషారుగా, మరెంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. ఈ వీడియోలో మేకింగ్‌ విజువల్స్‌ని కూడా జోడించడం వల్ల పాటకు ఒక కొత్త అందం వచ్చింది. ఈ పాట మా సినిమా ప్రమోషన్‌కి ఎంతో ఉపయోగపడుతుందన్న నమ్మకం మాకు ఉంది. మార్చి 1న విడుదలవుతున్న మా ‘ఇంటి నెం.13’ చిత్రానికి ఘన విజయాన్ని చేకూర్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. ‘తెలుగు ఆడియన్స్‌ ఇప్పటివరకు చూడని ఒక కొత్త తరహా చిత్రం ‘ఇంటి నెం.13’. ఈ సినిమా డెఫినెట్‌గా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తుంది’ అని నిర్మాత హేసన్‌ పాషా అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement