ప్రియుడితో ప్రేమ పెళ్లి.. విడాకులతో షాకిచ్చిన బుల్లితెర నటి! | FamousTv Actress Takes Divorce With Her Husband Goes Viral | Sakshi
Sakshi News home page

Tv Actress Divorce: నటుడితో సీక్రెట్‌గా పెళ్లి.. ఏడాదిలోపే విడాకులు!

Published Tue, Feb 13 2024 5:03 PM | Last Updated on Tue, Feb 13 2024 5:56 PM

FamousTv Actress Takes Divorce With Her Husband Goes Viral  - Sakshi

కోలీవుడ్‌లో బుల్లితెరపై మెప్పించిన నటి ప్రియాంక నల్కారి. తమిళంలో సీతారామన్ అనే సీరియల్‌తో కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత రోజా సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన-3’ సినిమాల్లోనూ మెరిసింది. అంతేకాకుండా టాలీవుడ్‌లో అందరి బంధువయా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎస్‌ఎంఎస్, హైపర్, నేనేరాజు నేనేమంత్రి, వైఫ్‌ఆఫ్‌ రామ్, కిక్-2 చిత్రాల్లో నటించింది. 

అయితే గతేడాది ఆడియన్స్‌కు ఊహించని షాకిచ్చింది ప్రియాంక. తన ప్రియుడిని సీక్రెట్‌గా పెళ్లాడింది. బుల్లితెర నటుడు రాహుల్ వర్మను  మలేషియాలో పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. ఆ వార్త విన్న ఫ్యాన్స్‌ ఆశ్చర్యానికి గురయ్యారు. కోలీవుడ్‌లో బుల్లితెరతో పాటు వెండితెరపై మెరిసిన ప్రియాంక నల్కారి ఇండస్ట్రీలో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలో  నలదమయంతి అనే సీరియల్‌లో లీడ్ రోల్ పోషిస్తున్నారు ప్రియాంక నల్కారి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది.'

ఏడాదిలోపే విడాకులు..!

గతేడాది మార్చిలో పెళ్లిబంధంతో ఒక్కటైన ఈ జంట విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆడియన్స్‌తో నిర్వహించిన ఇంటరాక్షన్‌లో సెషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. మీరు భర్తతో విడిపోయారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అవునని సమాధానమిచ్చింది ప్రియాంక. అలా అభిమానులు అడిగిన ప్రశ్నలకు తన ఇన్‌స్టా స్టోరీస్‌  ద్వారా సమాధానాలిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. పెళ్లైన ఏడాదిలోపే ప్రియాంక విడాకులు తీసుకోవడంతో కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

గతంలో వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే ప్రియాంక సీతారామన్ సీరియల్ నుంచి తప్పుకుంది. అప్పట్లోనే దీనికి కారణం తన భర్తే అని కూడా చెప్పుకొచ్చింది. ప్రియాంక ఓ సీరియల్‌లో నటించేందుకు చెన్నైకి రావడం.. ఆమె భర్త మలేషియాలో ఉండడంతో వారి మధ్య దూరం పెరగడం వల్లే ప్రియాంక నటనకు స్వస్తి చెప్పిందని కూడా కొందరు రాసుకొచ్చారు.

కానీ.. ఆ తర్వాత ప్రియాంక నలదమయంతి అనే సీరియల్‌తో మళ్లీ నటించడం ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితమే ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో భర్త ఫోటోలన్నింటినీ తొలగించింది. ప్రియాంక భర్త రాహుల్ కూడా ఆమెతో ఉన్న ఫోటోలన్నీ డిలీట్ చేశాడు. అయితే విడిపోవడానికి గల కారణాన్ని మాత్రం ప్రియాంక నల్కారి వెల్లడించలేదు. ఈ టాపిక్ ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

ఇక ప్రియాంక భర్త రాహుల్ వర్మ విషయానికొస్తే.. నటుడు, బిజినెస్‌ మేన్‌ రాణిస్తున్నారు. అతడు తెలుగులో పలు సీరియల్స్‌లో నటించాడు. అదే క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట 2018లో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత గతేడాది మలేషియాలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement