
అల్లు అర్జున్ టాలీవుడ్ హీరోల్లో ఆయన రేంజ్ అందరికీ తెలిసిందే. బన్నీ, రష్మిక నటించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజులుగా వైజాగ్‌లో జరుగుతోంది. తాజాగా షెడ్యూల్ పూర్తవ్వటంతో బన్నీ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో చేసిన పోస్ట్ వైరలవుతోంది.
వైజాగ్ బీచ్ ముందు నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేశారు. థాంక్యూ వైజాగ్ అంటూ పోస్ట్ చేశారు. అలాగే విశాఖపట్నం ఎప్పటికైనా నాకు ప్రత్యేకమే అంటూ నోట్ రాశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే వైజాగ్‌లో ఫోటో షూట్‌కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఆయన అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఫ్యాన్స్ అత్యుత్సాహానికి ఏకంగా ఫోటో షూట్ రద్దయింది.
Comments
Please login to add a commentAdd a comment