
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి :
కన బడలేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేదా గోదారి నీళ్ల రక్తఘోష
॥
గుండెనిండ పాలున్నా బిడ్డలకందించలేని
తల్లిబతుకు దేనికనీ
బీళ్లు నింపె నీళ్లున్నా సముద్రాన పడిపోయే
శాపం తనకెందుకనీ
బలువై దయకరువై తను వెలియై ఇక బలియై
బృందం:
బలువై దయకరువై
తను వెలియై ఇక బలియై
ఉప్పు సాగరాలలోకి వెళ్లలేక వెళ్లలేక
వెక్కివెక్కి పడుతున్నది
వృథా కథలు మోయలేక...
ఆ అలల అలజడి ఆ తడి ఆరని కంటతడి
ఆ అలల అలజడి తడి ఆరని కంటతడి
కనబడలేదా వినబడడం లేదా
॥
చరణం :
శిలాపలకలేసి మీరు ఎలా మరచిపోయారని
బాసరలో సరస్వతి పీఠమెక్కి అడిగినది
దుర్మదాంధులార తెలుగు బిడ్డలకీ కర్మేందని
ధర్మపురిలో నారసింహ నాదం చేస్తున్నది
ఎడారులుగ మారుతున్న పొలాలను చూడలేక
కాళేశ్వర శివలింగం కాళ్లు కడిగి ఏడ్చినది
బతుకు మోయలేని
రైతు ఆత్మహత్యలకు చలించి
భద్రాచల రాముడి కి సాగిలపడి మొక్కినది
పాపికొండల గుండె ధారై ప్రవహించినది
ధవళేశ్వర కాటన్ మహాశయుని తలచినది
సిగ్గుపడండని కుటిల నాయకులను తిట్టినది
గుండె పగిలి సరసాపూర్ సముద్రాన దూకినది
చిత్రం : బన్ని (2005)
రచన : సుద్దాల అశోక్‌తేజ, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : ఎస్.పి.బాలు, బృందం