ఆర్సీబీ విజయంపై అల్లు అర్జున్‌ ట్వీట్‌.. అయాన్‌ ఫుల్ ఎమోషనల్! | Allu Arjun Special Tweet On RCB Winning The IPL 2025 Trophy, Allu Ayaan Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Allu Arjun Tweet On RCB: ఆర్సీబీ విజయంపై అల్లు అర్జున్‌ ట్వీట్‌.. అయాన్‌ ఫుల్ ఎమోషనల్!

Jun 4 2025 7:50 AM | Updated on Jun 4 2025 8:47 AM

Tollywood Hero Allu arjun Tweet On RCB won the IPL Trophy

ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌లో బెంగళూరు టీమ్ విజయంపై ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ స్పందించారు. ఈ క్షణం కోసమే 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని ట్విటర్ వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు. వెయిట్ ఈజ్ ఓవర్.. ఈ సాలా కప్ నమ్‌దే అంటూ బన్నీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్సీబీ జట్టుకు, అభిమానులకు అభినందనలు తెలిపారు.

ఆర్సీబీ మ్యాచ్ గెలిచన అనంతరం అల్లు అర్జున్ కుమారడు అయాన్ ఫన్నీగా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. తాను కోహ్లీకి వీరాభిమానినని అయాన్‌ ఆనందం వ్యక్తం చేశాడు. తలపై వాటర్ బాటిల్‌తో నీళ్లు పోసుకుని బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఇది చూసిన బన్నీ నవ్వుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫుల్లీ ఎమోషనల్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు ఐకాన్ స్టార్‌.

కాగా.. గతేడాది పుష్ప-2 బ్లాక్‌ బస్టర్‌ హిట్ కొట్టిన అల్లు అర్జున్‌ ప్రస్తుతం సినిమాలకు కాస్తా విరామం ఇచ్చాడు. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అట్లీతో సినిమా చేయనున్నారు. ఇటీవలే పుష్ప-2 సినిమాకు ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డ్ అందుకున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement