'పవనిజం జిందాబాద్' అంటూ 'బన్నీ' వెబ్ సైట్ హ్యాక్!
Published Thu, Nov 6 2014 8:19 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
విజయవాడ: 'మీ కాలేజి వెబ్ సైట్ సెక్యూరిటీ సిస్టమ్ చాలా వీక్ గా ఉంది' అని హెచ్చరిస్తూ ఓ కాలేజి వెబ్ సైట్ ను బన్నీ పేరుతో హ్యాక్ చేయడమే కాకుండా పవనిజం జిందాబాద్ అంటూ ఓ సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. బన్ని అంటే అల్లు అర్జున్ అనుకుంటే పొరపాటే.
బన్ని పేరుతో విజయవాడ సమీపంలో మైలవరంలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజి వెబ్ సైట్ ను ఇటీవల హ్యాక్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హ్యాకింగ్ పాల్పడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫోటోను పెట్టి పవనిజం జిందాబాద్ అనే సందేశాన్ని హోంపేజీలో పోస్ట్ చేశారు.
'మా వెబ్ సైట్ ను హ్యాక్ చేసినట్టు గమనించాం. ఇందుకు బాధ్యులైన వారిపై తర్వాత దృష్టిపెడుతాం' అని కాలేజి యాజమాన్యం ఓ దినపత్రికకు వెల్లడించారు. ప్రస్తుతం కాలేజి వెబ్ సైట్ ను పునరుద్దరించి.. యధావిధిగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల కరెన్సీ నోటును ఫ్యాన్స్ మార్పింగ్ చేసి గాంధీజీ బొమ్మ స్థానంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను పెట్టడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement