website hack
-
మైనార్టీ స్కాలర్‌షిప్‌ల వెబ్సైట్ హ్యాక్!
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వానికి చెందిన మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్ వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. కాలేజీ యాజమాన్యాలకు తెలియకుండానే వాటి లాగిన్ ఐడీ ద్వారా విచ్చలవిడిగా దరఖాస్తులు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా లక్షల్లో. ఏటా వచ్చే దరఖాస్తుల కంటే సుమారు 80లక్షలు అదనంగా వచ్చాయి. దీంతో అనుమానం వచ్చిన కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ రీవెరిఫికేషన్ నిమిత్తం ఆ నకిలీ దరఖాస్తుల గురించి ఆయా రాష్ట్రాలను అప్రమత్తంచేసి వాటిని ఆన్లైన్లో తిప్పి పంపింది. మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారిస్తే అనేక విషయాలు బయటపడ్డాయి. అవి ఏమిటంటే.. ►రాష్ట్రంలోని పలు కాలేజీలు, స్కూళ్లలో పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నట్లు ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేశారు. ►ఇలా విజయవాడలోని పలు శ్రీ చైతన్య కాలేజీల నుంచి సుమారు వెయ్యి మంది మైనార్టీ విద్యార్థుల పేర్లతో నకిలీ దరఖాస్తులు వెళ్లాయి. ►అలాగే, విజయవాడలోని మరో హైస్కూలు నుంచి 150 మంది మైనార్టీ విద్యార్థుల పేర్లతో దరఖాస్తులు చేశారు. నిజానికి ఈ స్కూలులో మైనార్టీ విద్యార్థులు ఒక్కరు కూడా దరఖాస్తు చేయలేదు. ►ఇలా ఏపీ నుంచి మొత్తం 3లక్షల నకిలీ దరఖాస్తులు వెళ్లాయి. ►ఇవన్నీ ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల అడ్రస్‌లతో ఏపీలోని కాలేజీలు, స్కూళ్ల నుంచి దరఖాస్తులు చేసినట్లు రికార్డ్ అయింది. దీంతో కాలేజీ యాజమాన్యాలను పిలిపించి వారి స్కూలు నుంచి ఎంతమంది మైనార్టీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారనే వివరాలు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. వెబ్సైట్ ఓపెన్ చేసి కాలేజీ నుంచి వెళ్లిన అసలైన దరఖాస్తులు మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తొలగిస్తున్నారు. అసలు తాము దరఖాస్తే చేయకుండా తమ స్కూలు నుంచి దరఖాస్తు చేసినట్లు వెబ్సైట్లోకి ఎలా వచ్చాయో అర్థంకావడం లేదని యాజమాన్యాలు చెబుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరెవరికి ఇస్తారంటే.. మైనార్టీ విద్యార్థులు కేంద్ర స్కాలర్‌షిప్‌ల కోసం వెబ్సైట్లో నేరుగా కాలేజీల నుంచి దరఖాస్తులు చేసుకుంటారు. మంజూరు కాగానే స్కాలర్షిప్ డబ్బులు నేరుగా విద్యార్థి అకౌంట్‌కు ఆన్లైన్ ద్వారా జమ అవుతాయి. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పారసీలు, జైనులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రూ.లక్షలోపు ఆదాయం ఉన్న విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రూ.వెయ్యి, 6–10వ తరగతి విద్యార్థులకు రూ.5,000లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద ఇంటర్మీడియెట్ వారికి రూ.6,000లు, అండర్ గ్రాడ్యుయేట్స్‌కు రూ. 6,000లు నుంచి 12,000ల వరకు ఇస్తారు. వీరికి రూ. 2లక్షల లోపు ఆదాయం ఉండాలి. ప్రొఫెషనల్ కోర్సులు, సాంకేతిక విద్యా కోర్సులు చదువుతున్న వారికి రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు ఏటా ఇస్తారు. వీరికి సంవత్సర ఆదాయం రూ.2.5 లక్షలకు మించకుండా ఉండాలి. సైబర్ నేరగాళ్ల పని.. వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు కాలేజీల లాగిన్ ఐడీలు తెలుసుకుని నకిలీ పేర్లతో దరఖాస్తులు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అలాగే, కొందరు కాలేజీల యజమానులు కాలేజీ నుంచి విద్యార్థులతో దరఖాస్తులు చేయకుండా ఇంటర్నెట్ సెంటర్ల వారికి అప్పగించి వారికి కాలేజీ లాగిన్ ఐడీ చెప్పడంవల్ల కూడా దుర్వినియోగం చేసి ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. ఇలాంటి కాలేజీలు, స్కూళ్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై సమగ్రమైన దర్యాప్తుకు కేంద్రం ఆదేశించనుంది. -
కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్సైట్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాకిస్తాన్‌కు చెందిన దుండగులు హ్యాక్ చేశారు. కేంద్ర మంత్రి కాకముందు ఈ వెబ్‌సైట్‌ను తన స్థానిక ఈవెంట్ల కవరేజీ కోసం ఆయన వినియోగించేవారు. కేంద్ర మంత్రి అయ్యాక ఈ వెబ్‌సైట్‌ను అంతగా వినియోగించడం లేదు. ఆగస్టు 15న ఈ వెబ్సైట్ హ్యాక్ అవగా.. ఆలస్యంగా గుర్తించినట్టు తెలుస్తోంది. వెబ్సైట్ హ్యాక్ అయినట్టుగా కిషన్‌రెడ్డి కార్యాలయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన పాకిస్తాన్ దుండగులు అందులో భారతదేశంపై దూషణలు చేశారు. ‘హ్యాపీ ఇండిపెండెన్స్ డే పాకిస్తాన్.. హ్యాక్డ్ బై మిస్టర్ హెచ్‌ఏకే.. పాకిస్తాన్ జిందాబాద్’అని శీర్షికగా రాశారు. ‘మా కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు సెల్యూట్..’అంటూ భారతదేశాన్ని దూషించారు. ‘కశ్మీర్‌ను విముక్తి చేయండి.. మేం యుద్ధానికి సిద్ధం.. ఫిబ్రవరి 27 గుర్తుంచుకోండి..’ అంటూ రాశారు. -
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెబ్సైట్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి వ్యక్తిగత వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైంది. పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్స్ ఈ కుట్రకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15 నుంచి ఆయన వ్యక్తిగత వెబ్సైట్లో దేశ వ్యతిరేక సందేశాలు వస్తున్నాయని గమనించిన సిబ్బంది వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైనట్లు నిర్ధారించింది. అయితే అది వ్యక్తిగత వెబ్సైట్ కావడంతో దేశ భద్రతకు సంబంధిచిన ఎలాంటి సమాచారం అందులో లేదని, కేవలం పార్టీ, ఆయన వ్యక్తిగత కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక నిపుణుల సహాయంతో వెబ్‌సైట్‌ను హ్యాకింగ్ బారి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. -
బీబీసీ వెబ్సైట్ హ్యాక్
లండన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పనిచేసే ఓ హ్యాకర్స్ గ్రూప్.. బీబీసీ నెట్వర్క్ వెబ్సైట్లను హ్యాక్ చేసినట్టు వెల్లడించింది. కొత్త ఏడాది సందర్భంగా ముందు రోజు గురువారం కొన్ని గంటల పాటు బీబీసీ వెబ్సైట్లు పనిచేయలేదు. ఈ వార్తపై బీబీసీ యాజమాన్యం స్పందించలేదు. హ్యాకర్లు దాడి చేసిన విషయన్ని ధ్రువీకరించడం కానీ తోసిపుచ్చడం కానీ చేయలేదు. కాగా ఐఎస్ సభ్యులు, అనుబంధ వెబ్సైట్లను హ్యాక్ చేస్తుంటామని హ్యాకర్స్ గ్రూప్ వెల్లడించింది. తమ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు బీబీసీ వెబ్సైట్లను హ్యాక్ చేసినట్టు హ్యాకర్స్ గ్రూప్ పేర్కొంది. -
3 కోట్ల వివాహేతర సంబంధాలు రట్టయ్యాయి!
'లైఫ్ ఈజ్ షార్ట్. హ్యావ్ ఆన్ అఫైర్' నినాదంతో వివాహేతర బంధాలకు వేదికగా నిలిచిన ప్రముఖ ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్ 'యాష్లే మాడిసన్' యూజర్లు ఒకొక్కరిగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ సంక్షోభం ఇలానే కొనసాగితే మరింతమంది ప్రాణాలుపోయే అవకాశాం ఉండటంతో పలు దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 46 దేశాల్లో యాక్టివ్ గా పనిచేస్తున్న ఈ సైట్‌కు మూడు కోట్ల మందికిపైగా వినియోగదారులు ఉన్నారు. ఆయా వ్యక్తులు తమ టేస్ట్‌కు తగ్గ పార్ట్నర్తో వివాహేతర బంధాన్ని కొనసాగించేందుకు ఈ సైట్ ఉపకరిస్తుంది. అయితే గత నెలలో యాష్లే సైట్‌పై హ్యాకర్లు దాడి చేశారు. కస్టమర్ల వివరాలన్నింటినీ దొంగిలించి, యాష్లే యాజమాన్యంతో బేరసారాలకు దిగారు. భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. డీల్ కుదరకపోవడంతో విడతలవారీగా తమ దగ్గరున్న డేటాను లీక్ చేస్తున్నారు.. దీంతో కస్టమర్లలో తీవ్ర కలకలం చెలరేగింది. తమ ప్రైవేటు వ్యవహారం ఇలా నలుగురికీ తెలిసిపోవడాన్ని అవమానంగా భావించిన ఒకరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కేసులో సీరియస్‌నెస్‌ను గుర్తించిన కెనడా పోలీసులు అమెరికా ఎఫ్‌బీఐ సహకారంతో హ్యాకర్లను కనిపెట్టే పనిలో ఉంది. మరోవైపు యాష్లే మాడిసన్ మాతృసంస్థ అవిద్ లైఫ్ మీడియా కూడా తన క్లయింట్ల పరువు కాపాడేందుకు ముందుకొచ్చింది. వెబ్‌సైట్‌పై దాడి చేసిన హ్యాకర్ల వివరాలు తెలిపినవారికి రెండున్నర కోట్ల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. ఈ వివాహేతర బంధాల లీకేజీ వ్యవహారం ముందుముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలిమరి. -
'పవనిజం జిందాబాద్' అంటూ 'బన్నీ' వెబ్ సైట్ హ్యాక్!
విజయవాడ: 'మీ కాలేజి వెబ్ సైట్ సెక్యూరిటీ సిస్టమ్ చాలా వీక్ గా ఉంది' అని హెచ్చరిస్తూ ఓ కాలేజి వెబ్ సైట్ ను బన్నీ పేరుతో హ్యాక్ చేయడమే కాకుండా పవనిజం జిందాబాద్ అంటూ ఓ సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. బన్ని అంటే అల్లు అర్జున్ అనుకుంటే పొరపాటే. బన్ని పేరుతో విజయవాడ సమీపంలో మైలవరంలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజి వెబ్ సైట్ ను ఇటీవల హ్యాక్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హ్యాకింగ్ పాల్పడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫోటోను పెట్టి పవనిజం జిందాబాద్ అనే సందేశాన్ని హోంపేజీలో పోస్ట్ చేశారు. 'మా వెబ్ సైట్ ను హ్యాక్ చేసినట్టు గమనించాం. ఇందుకు బాధ్యులైన వారిపై తర్వాత దృష్టిపెడుతాం' అని కాలేజి యాజమాన్యం ఓ దినపత్రికకు వెల్లడించారు. ప్రస్తుతం కాలేజి వెబ్ సైట్ ను పునరుద్దరించి.. యధావిధిగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల కరెన్సీ నోటును ఫ్యాన్స్ మార్పింగ్ చేసి గాంధీజీ బొమ్మ స్థానంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను పెట్టడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. Follow @sakshinews