కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌ హ్యాక్‌ | hackers target personal website of G Kishan Reddy | Sakshi
Sakshi News home page

కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ హ్యాక్‌

Published Tue, Aug 25 2020 5:05 PM | Last Updated on Tue, Aug 25 2020 5:06 PM

hackers target personal website of G Kishan Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి వ్యక్తిగత వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్స్‌ ఈ కుట్రకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆగస్ట్‌ 15 నుంచి ఆయన వ్యక్తిగత వెబ్‌సైట్‌లో దేశ వ్యతిరేక సందేశాలు వస్తున్నాయని గమనించిన సిబ్బంది వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైనట్లు నిర్ధారించింది. అయితే అది వ్యక్తిగత వెబ్‌సైట్‌ కావడంతో దేశ భద్రతకు సంబంధిచిన ఎలాంటి సమాచారం అందులో లేదని, కేవలం పార్టీ, ఆయన వ్యక్తిగత కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక నిపుణుల సహాయంతో వెబ్‌సైట్‌ను హ్యాకింగ్‌ బారి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement