నేనెప్పుడు అలా ఆలోచించలేదు: వర్మ | Ram Gopal Varma tweets about Bunny | Sakshi
Sakshi News home page

నేనెప్పుడు అలా ఆలోచించలేదు: వర్మ

Apr 27 2016 4:49 PM | Updated on Mar 22 2019 5:33 PM

నేనెప్పుడు అలా ఆలోచించలేదు: వర్మ - Sakshi

నేనెప్పుడు అలా ఆలోచించలేదు: వర్మ

వీళ్లు, వాళ్లు అనే తేడా చూపకుండా.. ఎవ్వరినీ వదలకుండా తనవైన మాటల తూటాలతో వెంటాడే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. 'సరైనోడు' మీద కూడా ఓ కన్నేశాడు.

వీళ్లు, వాళ్లు అనే తేడా చూపకుండా.. ఎవ్వరినీ వదలకుండా తనదైన శైలిలో మాటల తూటాలతో వెంటాడే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. 'సరైనోడు' మీద కూడా ఓ కన్నేశాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' కంటే సరైనోడు చాలా చాలా పెద్ద హిట్ అంటూ ట్వీట్ చేశాడు. పవన్ కన్నా బన్నీనే సూపర్ హిట్ హీరో అనే అర్థం వచ్చేలా తన స్టైల్లో కామెంట్లు చేశాడు.

నిజానికి తానెప్పుడూ అలా ఆలోచించలేదని, బన్నీని పవర్ స్టార్ తో పోల్చి చూడాలని ఎప్పుడూ అనుకోలేదని.. కానీ సరైనోడు  సినిమాతో పవన్ కన్నా బన్నీ చాలా ఎదిగిపోయాడని.. ఈ విషయంలో తను చాలా ఆశ్చర్యపోతున్నానంటూ ట్వీటాడు రామ్ గోపాల్ వర్మ.

ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై వర్మ చేసిన కామెంట్లకు పవన్ కల్యాణ్.. 'ఆయన విచిత్ర మైన వ్యక్తి. నన్నడిగితే, ఆయన బయటవాళ్ళ మీద పెట్టే శ్రద్ధ తనపై, తన సిన్మాలపై పెడితే వేరే స్థాయికి వెళ్ళేవారు' అంటూ స్పందించిన విషయం తెలిసిందే. అయినా రామూ మాత్రం తన దారిలో తాను దూసుకుపోతున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement