బన్నీ హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా? | Bunny Actress Gowri Munjal Latest Pics Goes Viral | Sakshi
Sakshi News home page

Gowri Munjal: టాలీవుడ్ సినిమాతోనే ఎంట్రీ.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా?

Published Sat, Apr 15 2023 7:06 PM | Last Updated on Sat, Apr 15 2023 7:09 PM

Bunny Actress Gowri Munjal Latest Pics Goes Viral - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన చిత్రం 'బన్నీ'. అప్పట్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఫ్యాన్స్ ఆయనను బన్నీ అని పిలవడం మొదలెట్టారు. దీంతో అభిమానుల్లో బన్నీగా ముద్ర పడిపోయారు. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన దిల్లీ భామ గౌరి ముంజల్‌ నటించింది. ఆ సినిమాతోనే ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దిల్లీలో పుట్టి పెరిగిన ఈ భామ.. సినిమాలపై ఆసక్తితో ముంబయికి వచ్చి ఇండస్ట్రీలో ప్రవేశించింది.

అయితే బన్నీ సినిమా క్రేజ్‌తో ఆమెకు అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఈ మూవీతో వచ్చినంత సక్సెస్‌ ఆ తర్వాత కలిసి రాలేదు. ఆమె తెలుగులో శ్రీ కృష్ణ -2006, గోపి - గోడ మీద పిల్లి, కౌసల్య సుప్రజా రామ చిత్రాల్లోనూ కనిపించింది. అయితే ప్రస్తుతం ఆమె ఎలా ఉంది? ఏం చేస్తోందో తెలుసుకుందాం. 

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. గౌరీ దాదాపు 16 చిత్రాల్లో కనిపించింది. కానీ సినిమాల్లో ఆమెకు అవకాశాలు తగ్గిపోవడంతో 2011లో దిల్లీకి తిరిగి వెళ్లిపోయింది. అక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడిపోయింది. కానీ ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌కు గౌరీ ముంజల్ హాజరు కాగా ఆ ఫొటోలు బయటకొచ్చాయి. వాటిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. బన్నీ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి? అంటూ అవాక్కవుతున్నారు. 

(ఇది చదవండి: అలా ముద్దు పెట్టుకునే ఛాన్స్‌ నాకెప్పుడొస్తుందో?: టాలీవుడ్ యాంకర్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement