పాట్నాలో ఐకాన్ స్టార్‌.. ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెల్‌కమ్‌! | Allu Arjun Receives Grand Welcome In Patna To Attend Pushpa 2 The Rule Movie Trailer Launch Event, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Allu Arjun Grand Welcome Video: పాట్నాలో ల్యాండయిన ఐకాన్ స్టార్‌.. ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెల్‌కమ్‌!

Published Sun, Nov 17 2024 2:35 PM | Last Updated on Sun, Nov 17 2024 3:44 PM

Allu Arjun Receives Grand Welcome In Patna to attend Trailer Launch event

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ  సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.  

అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేయనున్నారు. పాట్నాలో ఏర్పాటు భారీ ఈవెంట్‌లో ట్రైలర్‌ రిలీజ్ చేస్తున్నారు. ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఐకాన్ స్టార్ ఇప్పటికే పాట్నా చేరుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నగరంలో గాంధీ మైదానంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రబృంద సభ్యులు పాట్నా చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు ట్రైలర్‌ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement