విజయవాడ : దక్షిణ భారతదేశపు మొబైల్ రిటైల్ వ్యాపారంలో సంచలనం సృష్టించి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తరించిన మల్టీబ్రాండ్ స్మార్ట్ మొబైల్ రిటైల్ చైన్ ‘లాట్ మొబైల్’ 101వ స్టోర్ విజయవాడలో ప్రారంభమైంది. బందరురోడ్డులో ఏర్పాటుచేసిన ఈ షోరూమ్‌ను లాట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్, సినీ హీరో అల్లు అర్జున్ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ రంగంలో లాట్ సంచలనం సృష్టించగలదన్నారు. అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు లాట్ మొబైల్స్‌లో ఉంటాయని, మన హార్ట్ బీట్‌ను కూడా లాట్‌తో చెక్ చేసుకోవచ్చన్నారు. లాట్ ఆఫర్లను యువత సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, గుణశేఖర్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేస్తున్నట్లు అర్జున్ చెప్పారు. లాట్ మొబైల్స్ డెరైక్టర్లు రాజా, సంతోష్ మాట్లాడుతూ విజయవాడలో తమకు ఇది ఆరవ స్టోర్ అన్నారు.
దీపావళికి ‘లాట్’ స్మార్ట్ ఆఫర్లు అనేకం ఉన్నాయని, నగరంలో మొదటిసారిగా రూ.4.40 లక్షల విలువైన హార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 మోటార్ బైక్‌ను.. ‘మొబైల్ కొనండి.. ఈ రేసుగుర్రం గెలవండి’ అనే పోటీలు నిర్వహించి విజేతకు అందించనున్నామన్నారు. ఈ కాంటెస్ట్ ఆరు మొబైల్ స్టోర్స్‌లో జరుగుతుందన్నారు. ఒక మొబైల్ కొంటే రెండు ఉచితం (1+2), 1+3, 1+4 వంటి ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. మెమొరీ కార్ట్ ఆఫర్లు, పవర్ బ్యాంక్ ఆఫర్లు, రెండు బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు కేవలం రూ.4,999కు, మూడు 3జీ మొబైల్స్ రూ.2,999 ఇస్తున్నట్లు వారు వివరించారు.
బెజవాడలో బన్నీ సందడి
Published Tue, Oct 21 2014 1:10 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM
Advertisement
Advertisement