
బ్లేడ్ బ్యాచ్ వీరంగం
విజయవాడ: నగరంలో ఓ బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో పట్టపగలే ఓ దుకాణంలో సెల్ ఫోన్ల చోరీకి ప్రయత్నించింది. అడ్డుకోబోయిన వారిపై బ్లేడ్లతో దాడికి యత్నించారు. దుకాణాల సిబ్బంది అంతా రావటంతో నలుగురు పరారయ్యారు. చాకచక్యంగా దుకాణదారులు ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.