
అల్లు అర్జున్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో బన్నీ ఒకటి. 2008లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది

వి. వి. వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమాతో గౌరి ముంజల్ తెలుగు తెరకు పరిచయం అయింది

ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ భామ.. సినిమాలపై ఆసక్తితో ముంబయికి వచ్చి ఇండస్ట్రీలో ప్రవేశించింది

బన్నీతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే ఆ తర్వాత మాత్రం ఆమెకు ఈ స్థాయి విజయం దక్కలేదు

తెలుగులో ఆమె నటించిన శ్రీ కృష్ణ -2006, గోపి - గోడ మీద పిల్లి, కౌసల్య సుప్రజా రామ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. గౌరీ దాదాపు 16 చిత్రాల్లో కనిపించింది

సినిమాల్లో ఆమెకు అవకాశాలు తగ్గిపోవడంతో 2011లో దిల్లీకి తిరిగి వెళ్లిపోయింది. అక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడిపోయింది

అయితే గౌరి ముంజల్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు. దాంతో ఆమె ఇప్పుడు ఎలా ఉంది అన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో ఆమెకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి