Female Film Producer Harassed By Unknown Man At KBR Park Hyderabad - Sakshi
Sakshi News home page

KBR Park Female Producer Harassment: కేబీఆర్‌ పార్క్‌లో మహిళా నిర్మాతకు వేధింపులు, అశ్లీల హావభావాలతో..

Published Fri, Jul 14 2023 1:48 PM | Last Updated on Fri, Jul 14 2023 2:06 PM

Female Film Producer Harassed at KBR Park Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ మహిళా నిర్మాతకు కేబీఆర్‌ పార్కులో చేదు అనుభవం ఎదురైంది.  పార్కు వద్ద జాగింగ్‌ చేస్తున్న నిర్మాతను ఓ పోకిరి లైంగిక వేధింపులకు గురి చేశాడు. తాను జాగింగ్‌ చేస్తుంటే ఆమెను కారులో వెంబడిస్తూ వేధించాడు. అశ్లీల హావభావాలతో తనను ఇబ్బందిపెట్టడమే కాకుండా తన ఫోన్‌లో ఆమెను చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. దాదాపు గంటన్నరపాటు ఆమె వెంటపడుతూ ఇబ్బందికరంగా ప్రవర్తించాడు.

ఈ వేధింపులు తట్టుకోలేక సదరు 32 ఏళ్ల నిర్మాత బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు 354ఎ, 354డి, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన జూలై 9న జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడు నలుపు రంగులో కారులో వచ్చినట్లు బాధితురాలు వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

చదవండి: కలిసిన కాసేపటికే ఇంటికి రమ్మన్నాడు.. వెళ్లి ఉండాల్సింది: హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement