
తెలుగు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొత్త కారు కొన్నాడు. ఈసారి బీఎమ్‌డబ్ల్యూ ఐ7 బ్రాండ్‌ను తన గ్యారేజీకి తీసుకొచ్చాడు. చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉన్న ఈ కారులో అత్యాధునిక టెక్నాలజీని వాడినట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రెండున్నర కోట్ల పైనే ఉన్నట్లు సమాచారం. ఇకపోతే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను అందించాడు. పసివాడి ప్రాణం, మెకానిక్ అల్లుడు, జల్సా, మగధీర, సరైనోడు, అల వైకుంఠపురములో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలున్నాయి.
తండ్రి నిర్మాతగా, తనయుడు హీరోగా బిజీ
అల్లు అర్జున్ 22వ సినిమాతో పాటు బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించే సినిమా సైతం గీతా ఆర్ట్స్ బ్యానర్‌లోనే నిర్మితం కానుంది. కొన్ని ఇతర భాషా చిత్రాలను అరవింద్ ఇక్కడ డబ్ చేయిస్తూ సక్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment